AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar CM: మద్యం సేవించేవారు భారతీయులే కాదు.. మహా పాపులు.. బీహార్ సీఎం నితిష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

మహాత్మా గాంధీ కూడా మద్యపానాన్ని వ్యతిరేకించారని, ఆయన సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించే వారు మహాపాపి అని బీహార్ అసెంబ్లీలో సీఎం నితీష్ కుమార్ అన్నారు.

Bihar CM: మద్యం సేవించేవారు భారతీయులే కాదు.. మహా పాపులు.. బీహార్ సీఎం నితిష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
Nitish Kumar
Balaraju Goud
|

Updated on: Mar 31, 2022 | 7:47 PM

Share

Bihar CM Nitish Kumar: బీహార్ రాష్ట్రంలో మొదటిసారిగా నేరస్తులకు మద్య నిషేధాన్ని తక్కువ కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించిన తర్వాత బీహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ కూడా మద్యపానాన్ని వ్యతిరేకించారని, ఆయన సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించే వారు మహాపాపి అని అన్నారు. “నేను ఈ వ్యక్తులను భారతీయులుగా పరిగణించను” అని కుమార్ పేర్కొన్నారు. “మద్యం విషపూరితమైనదని తెలిసిన తర్వాత కూడా వారు తాగుతున్నారు”అని ఇలాంటి వారిని క్షమించేదీ లేదన్నారు.

బీహార్‌లో మద్యంపై నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ అక్కడి ప్రజలు ఎక్కడి నుండైనా మద్యం తీసుకువచ్చి సేవిస్తున్నారు. బీహార్‌లో హింసకు ప్రధాన కారణాలలో ఒకటి మత్తు, దీని కారణంగా పోలీసు-పరిపాలన, ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసింది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. శాసనమండలిలో నిషేధ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ మద్యం ప్రియులకు ఇది అస్సలు నచ్చదని అన్నారు.

గురువారం బీహార్ అసెంబ్లీలో మద్య నిషేధ సవరణ బిల్లు ఆమోదం పొందింది. దీని కింద రాష్ట్రంలో తొలిసారిగా మద్యం తాగి పట్టుబడితే, జరిమానా చెల్లించిన తర్వాత పోలీసులు అతన్ని విడుదల చేసేలా తీసుకువచ్చిన బిల్లుకు ఆమోదం తెలిపారు. అయితే, మద్యపానం చేసేవారు మహా పాపులు. బీహార్‌లో మద్య నిషేధం వల్ల ప్రతి ఏటా రూ.5 వేల కోట్ల ఆదాయానికి గండి పడాల్సి వస్తోందని అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై సీఎం నితీశ్ మాట్లాడుతూ.. గతంలో 5 వేల కోట్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు నష్టం వాటిల్లిందని, అయితే రాష్ట్ర ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. మద్య నిషేధం వల్ల హింస తగ్గుముఖం పడుతోందన్నారు. అలాగే రాష్ట్రంలో క్రైమ్ గ్రాఫ్ తగ్గుతోందన్నారు.

బీహార్ లిక్కర్ ప్రొహిబిషన్ బిల్లు, 2022లోని సవరణ ప్రకారం, మొదటిసారి నేరం చేసినవారు జరిమానా డిపాజిట్ చేసిన తర్వాత డ్యూటీ మేజిస్ట్రేట్ నుండి బెయిల్ పొందే నిబంధన ఉంది. అపరాధి జరిమానాను డిపాజిట్ చేయలేని పక్షంలో వారికి ఒక నెల జైలు శిక్షను అనుభవించవలసి ఉంటుంది. నిషేధాన్ని ఉల్లంఘించినందుకు నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నప్పుడు, నిందితుడు మద్యం ఎక్కడి నుండి పొందారో ఆ వ్యక్తి పేరును వెల్లడించాలనే నిబంధన కూడా ఉంది.

బీహార్ ముఖ్యమంత్రి బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో 2016 ఏప్రిల్‌లో మద్య నిషేధం విధించారు. నిషేధం తరువాత, మద్యం సేవించడం కోసం మాత్రమే పెద్ద సంఖ్యలో ప్రజలు జైళ్లలో ఉన్నారు. ఉల్లంఘించినవారిలో ఎక్కువ మంది ఆర్థికంగా బలహీన వర్గాలు, పేద ప్రజలకు చెందినవారే ఉండటం విశేషం. సాధారణ కేసుల్లో కూడా బెయిల్ కోసం కోర్టుల్లో విచారణకు ఏడాది సమయం పడుతోంది.

2016లో బీహార్ ప్రభుత్వం తీసుకున్న మద్యపాన నిషేధం వంటి నిర్ణయాల వల్ల కోర్టులపై పెనుభారం పడిందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ గతేడాది చెప్పారు. ‘‘కోర్టుల్లో మూడు లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజలు చాలా కాలంగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పుడు మద్యం ఉల్లంఘనలకు సంబంధించిన అధిక కేసులు కోర్టులపై అదనపు భారాన్ని మోపుతున్నాయి, ”అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే లిక్కర్ ప్రొహిబిషన్ బిల్లు, 2022కు బీహార్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Read Also…  Pakistan Politics: అవిశ్వాస తీర్మానంపై చర్చకు విపక్షాల పట్టు.. గందరగోళం నడుమ పాక్ పార్లమెంట్‌లో ఏప్రిల్ 3కి వాయిదా!