Central government tax collection: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్న సంగతి తెలిసిందే. నిత్యం పెరుతున్న ధరలతో వాహనదారులు తల పట్టుకుంటున్నారు. అయితే చమురు ధరలపై గత ఆరేళ్లల్లో పెరిగిన ధరలను చూస్తే మీరే షాకవుతారు. ఎందుకంటే.. దాదాపు ఆరేళ్ల క్రితం ఉన్న ధరలపై 300ల శాతం పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. ఎక్సైజ్ సుంకం పెరగడంతో గత ఆరేళ్లలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 300 శాతానికి పైగా పెరిగాయని లోక్‌సభలో కేంద్రం సోమవారం తెలిపింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. 2014-15లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం ద్వారా పెట్రోల్‌పై రూ .29,279 కోట్లు వసూలు చేయగా.. డీజిల్‌పై రూ .42,881 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి 10 నెలల్లో పెట్రోల్, డీజిల్ వసూళ్లు రూ .2.94 లక్షల కోట్లకు పెరిగాయని విదేశాంగ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభలో అడిగిన అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
సహజ వాయువుపై ఎక్సైజ్ సుంకంతో కలిపి 2014-15లో కేంద్ర ప్రభుత్వం రూ .74,158 కోట్లు వసూలు చేసింది, ఇది 2020 ఏప్రిల్ నుండి 2021 జనవరి వరకు రూ .2.95 లక్షల కోట్లకు పెరిగిందని ఆయన తెలిపారు. 2014-15లో మొత్తం ఆదాయంలో ఒక శాతంగా పెట్రోల్, డీజిల్, సహజ వాయువుపై వసూలు చేసిన పన్నులు 5.4 శాతం ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 12.2 శాతానికి పెరిగాయని అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 2014లో లీటరుకు 9.48 రూపాయల ఉండగా.. ఇప్పుడు రూ .32.90 కు పెరిగింది. డీజిల్‌పై లీటరుకు 3.56 రూపాయల నుంచి 31.80 రూపాయలకు పెరిగింది.
అయితే ఢిల్లీలో రూ .91.17 ఉన్న లీటరు పెట్రోల్ రిటైల్ ధరలో.. 60 శాతం పన్నులు ఉన్నాయి. ఈ ధరలో 36 శాతం ఎక్సైజ్ సుంకం ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా డీజిల్ ధర 81.47 ఉండగా.. దీనిలో 53 శాతానికి పైగా పన్నులు ఉన్నాయి. 39 శాతం సెంట్రల్ ఎక్సైజ్ పన్నులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. అయితే అంతర్జాతీయ చమురు ధరల ప్రకారం.. రేట్లు పెరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
Also Read: