National Helpline Number: సైబర్ మోసాల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం.. ఈ నెంబర్‌కు కాల్ చేయండి.. మీ డబ్బును కాపాడుకోండి..

|

Jun 18, 2021 | 9:18 PM

National Helpline Number: రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోవడం.. సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో

National Helpline Number: సైబర్ మోసాల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం.. ఈ నెంబర్‌కు కాల్ చేయండి.. మీ డబ్బును కాపాడుకోండి..
Cyber Crime
Follow us on

National Helpline Number: రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోవడం.. సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సరికొత్త వ్యవస్థను తీసుకువచ్చింది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్క మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేసేందుకు నేషనల్ హెల్ప్‌లైన్ నెంబర్ 155260 ను ఏర్పాటు చేసింది. బాధితులు తమ ఖాతాల్లోని డబ్బు పోయినట్లు గుర్తించిన వెంటనే ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

ఈ హెల్ప్‌లైన్ నెంబర్ ప్రారంభం సందర్భంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు.. సైబర్ మోసాల కారణంగా జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అలాగే.. వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందించడానికి ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుందన్నారు. ఇదిలాఉంటే.. హెల్ప్‌లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులను హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్‌ కో ఆర్డిరేషన్ సెంటర్‌ మానిటరింగ్ చేస్తుంది. ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే.. సదరు నగదు సైబర్ నేరగాళ్ల అకౌంట్లలోకి వెళ్లకుండా మధ్యలోనే ఫ్రీజ్ చేస్తారు. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అన్ని ప్రధాన బ్యాంకుల సహకారం తీసుకుంటోంది భారత ప్రభుత్వం.

Also read:

Hyderabad: 7 రోజుల పసికందును.. రూ. 3 వేలకు అమ్మిన తల్లి.. ఆ తర్వాత ఏమైందంటే..?