Central Government: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. ఇకపై వారికీ హెల్మెట్ తప్పనిసరి.. పాటించకపోతే జైలే..

|

Feb 16, 2022 | 2:21 PM

Helmet: ప్రమాదాల్లో గాయాల నుంచి కాపాడుకునేందుకు హెల్మెట్ ఉపకరిస్తుంది. ఇప్పటి వరకు వాహనాలపై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే నియమం ఉండేది. కానీ.. నేడు కేంద్రం కొత్తగా మరిన్ని నిబంధనలను(New Helmet Rules) ప్రకటించింది..

Central Government: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. ఇకపై వారికీ హెల్మెట్ తప్పనిసరి.. పాటించకపోతే జైలే..
Helmet
Follow us on

Helmet: ప్రమాదాల్లో గాయాల నుంచి కాపాడుకునేందుకు హెల్మెట్ ఉపకరిస్తుంది. ఇప్పటి వరకు వాహనాలపై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే నియమం ఉండేది. కానీ.. నేడు కేంద్రం కొత్తగా మరిన్ని నిబంధనలను ప్రకటించింది. భారత్‌లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారులకు సైతం హెల్మెట్‌ను(Helmet to Children) తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలకు కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను ఈ మేరకు ప్రభుత్వం కోరింది. అలాగే పిల్లలు వారి భద్రత కోసం.. భద్రతా జీనును(Safety harness) ధరించాలని వెల్లడించింది. కొత్త నిబంధన ప్రకారం వీటిని ఉల్లంగించే వారిపై రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలలు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడతాయని కేంద్రం స్పష్టం చేసింది.

సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 కి సవరణ ద్వారా కొత్త నియమాలు ప్రతిపాదించబడ్డాయి. కొత్తగా తెచ్చిన నిబంధనలు నాలుగు సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు వర్తించనున్నాయి. పిల్లలతో సహా ప్రయాణిస్తున్న ఏదైనా ద్విచక్ర వాహనం.. గంటకు గరిష్ఠంగా 40 కిమీ కంటే మించిన వేగంతో ప్రయాణించకూడదు.

కొత్తగా తెస్తున్న ఈ చట్టాలపై పౌరుల అభిప్రాయాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2021 లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పిల్లల హెల్మెట్‌లను తయారు చేయమని ప్రభుత్వం భారతీయ హెల్మెట్ తయారీదారులను కోరినప్పటికీ, వాటి సైజు ప్రకారం, సేఫ్టీ జీను ఒక జత పట్టీలతో వస్తుంది, అది భుజం లూప్‌లను ఏర్పరుస్తుంది మరియు పిల్లలను డ్రైవర్‌కు సురక్షితం చేస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం, జీను తక్కువ బరువు, సర్దుబాటు, వాటర్ ఫూఫ్ తో మన్నికైనదిగా ఉండాలని సూచించింది.

అధిక సాంద్రత కలిగిన ఫోమ్‌తో భారీ నైలాన్ లేదా మల్టీఫిలమెంట్ నైలాన్ మెటీరియల్‌ని ఉపయోగించి జీను తయారు చేయబడుతుంది. ఇది 30 కిలోల బరువును హోల్డ్ చేసే విధంగా ఉండాలి. నాలుగేళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా క్రాష్ హెల్మెట్ లేదా సైకిల్ హెల్మెట్ ధరించటం ఇక తప్పనిసరి.

ఇవీ చదవండి.. 

EPFO: ఆ పీఎఫ్ ఖాతాలకు వడ్డీ వస్తుందా.. లేకుంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి..

Flight Tickets: ఆ దేశానికి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. విమాన టికెట్లపై భారీ తగ్గింపు..