AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. పెరగనున్న రీసైక్లింగ్‌ సామర్థ్యం.. రూ.1500 కోట్లతో ప్రోత్సాహక పథకం

దేశీయ రీసైక్లింగ్‌ సామర్థ్యం పెరగనుంది. క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించింది కేంద్రం. అంతేకాకుండా 15 వందల కోట్ల ప్రోత్సాహక పథకానికి ఆమోదం కూడా తెలిపింది. అసలు ఈ పథకం ఎందుకు ఉపయోగపడుతుంది?.. కేంద్రం లక్ష్యమేంటి?.. లాంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..

మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. పెరగనున్న రీసైక్లింగ్‌ సామర్థ్యం.. రూ.1500 కోట్లతో ప్రోత్సాహక పథకం
National Critical Mineral Mission
Shaik Madar Saheb
|

Updated on: Sep 04, 2025 | 9:16 AM

Share

దేశంలో కీలకమైన ఖనిజాల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ముందడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం. మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో 15 వందల కోట్ల విలువైన ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌లో భాగంగా అమలులోకి రానుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు మొత్తం ఆరు సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని చెబుతున్నారు. బ్యాటరీ వ్యర్థాలు, ఈ-వేస్ట్ నుంచి కీలకమైన ఖనిజాలను వెలికితీయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద కొత్త రీసైక్లింగ్ యూనిట్ల స్థాపన కోసమే కాకుండా ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణ, ఆధునీకరణ కూడా ప్రోత్సాహం లభిస్తుంది. పెద్ద యూనిట్లకు గరిష్టంగా 50 కోట్లు, చిన్న యూనిట్లకు గరిష్టంగా 25 కోట్లు ప్రోత్సాహకంగా అందించనున్నారు.

15 వందల కోట్లలో మూడోవంతు నిధులు చిన్న, కొత్త రీసైక్లింగ్ సంస్థలకు కేటాయించనున్నారు. ప్లాంట్‌లు, యంత్రాలు, పరికరాలు, సదుపాయాలపై 20 శాతం క్యాపెక్స్ సబ్సిడీ అందించనుంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా సకాలంలో ఉత్పత్తి ప్రారంభించే యూనిట్లకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహక సబ్సిడీ లభిస్తుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ పథకం ద్వారా 8 వేల కోట్లకుపైగా పెట్టుబడులు దేశీయ పరిశ్రమల ద్వారా వస్తాయని భావిస్తున్నారు. ప్రత్యక్షంగా 70 వేల ఉద్యోగులు కూడా వస్తాయంటున్నారు అధికారులు.

ఇకపై ప్రతి సంవత్సరం కనీసం 270 టన్నుల ఈ-వేస్ట్‌ను రీసైక్లింగ్ చేయడం ద్వారా సుమారు 40 టన్నుల కీలక ఖనిజాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఏర్పడుతుంది. 2070 నాటికి సున్నా కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది మోదీ సర్కార్‌. ప్రపంచంలో ఖనిజాల కొరత పెరుగుతున్న సమయంలో రీసైక్లింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత్ తన అవసరాలను తానే తీర్చుకునే దిశగా ముందడుగు వేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డా, అవకాడోనా? మీ ఆరోగ్యాన్ని కాపాడేది ఇదే..
బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డా, అవకాడోనా? మీ ఆరోగ్యాన్ని కాపాడేది ఇదే..
IND vs AFG: ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్.. ఆ ముగ్గురు ఔట్..?
IND vs AFG: ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్.. ఆ ముగ్గురు ఔట్..?
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి.. ఏది తింటే ఆరోగ్యానికి మేలు?
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి.. ఏది తింటే ఆరోగ్యానికి మేలు?
వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు పిల్లలు మృతి
వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు పిల్లలు మృతి
జర్మన్ సిల్వర్ అని ఎందుకు అంటారు? పేరు వెనుక అసలు కథ ఇదే!
జర్మన్ సిల్వర్ అని ఎందుకు అంటారు? పేరు వెనుక అసలు కథ ఇదే!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది