సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య పెంపు!

ఢిల్లీ: సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 31 నుంచి 34కు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడించారు. చీఫ్ జస్టిస్‌తో పాటు 33 మంది న్యాయమూర్తులు ఉంటారని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు ఒకసారి ఆమోదం లభిస్తే.. సీజేఐతో కలిపి 34కు పెరగనుంది. న్యాయమూర్తుల పెంపు అవసరాన్ని గతంలో సుప్రీంకోర్టు కేంద్రానికి అనేకసార్లు గుర్తు చేసింది. 1956లో తీసుకువచ్చిన సుప్రీంకోర్టు చట్టానికి 2009లో సవరణలు తీసుకువచ్చారు. అప్పుడు న్యాయమూర్తుల సంఖ్యను […]

  • Ravi Kiran
  • Publish Date - 12:00 am, Thu, 1 August 19
సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య పెంపు!

ఢిల్లీ: సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 31 నుంచి 34కు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడించారు. చీఫ్ జస్టిస్‌తో పాటు 33 మంది న్యాయమూర్తులు ఉంటారని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు ఒకసారి ఆమోదం లభిస్తే.. సీజేఐతో కలిపి 34కు పెరగనుంది.

న్యాయమూర్తుల పెంపు అవసరాన్ని గతంలో సుప్రీంకోర్టు కేంద్రానికి అనేకసార్లు గుర్తు చేసింది. 1956లో తీసుకువచ్చిన సుప్రీంకోర్టు చట్టానికి 2009లో సవరణలు తీసుకువచ్చారు. అప్పుడు న్యాయమూర్తుల సంఖ్యను 25 నుంచి 31 పెంచారు.