దేశంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు ముమ్మరం చేస్తోంది. దేశ వ్యాప్తంగా 105 చోట్ల దాడులు నిర్వహించింది. సైబర్ క్రైమ్‌కు సంబంధించి ఈ దాడి జరిగింది. రాష్ట్ర పోలీసుల సహకారంతో ఈ దాడులు నిర్వహిస్తోంది సీబీఐ. ఢిల్లీలోని 5 చోట్ల దాడులు నిర్వహించారు సీబీఐ అధికారులు. దీంతో పాటు అండమాన్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్‌లో కూడా దాడులు నిర్వహించారు. ‘ఆపరేషన్ చక్ర’ అనే పేరుతో ఈ దాడులు చేపట్టింది సీబీఐ. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ), ఇంటర్‌పోల్‌లు పంచుకున్న సమాచారం మేరకు.. సీబీఐఐ ఈ స్థలాలపై దాడులు చేసింది. సీబీఐ బృందం దేశవ్యాప్తంగా 87 చోట్ల దాడులు చేయగా, రాష్ట్ర పోలీసులు 18 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఐదు చోట్ల దాడులతో పాటు, అండమాన్, నికోబార్ దీవులు, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, అస్సాం, కర్ణాటకలో కూడా ఈ బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడిలో రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లో నకిలీ కాల్ సెంటర్‌ను రట్టు చేశారు.
కాల్ సెంటర్ నుంచి 1 కేజీ బంగారం, రూ.1.5 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. ప్రజలను మోసం చేసిన పూణె, అహ్మదాబాద్‌లలోని రెండు కాల్ సెంటర్లను కూడా గుర్తించారు సీబీఐ అధికారులు. ప్రస్తుతం అండమాన్‌లోని 4, చండీగఢ్‌లో 3, పంజాబ్, కర్ణాటక, అస్సాంలోని 2-2 ప్రాంతాల్లో సీబీఐ బృందం దాడులు చేస్తోంది. పుణె, అహ్మదాబాద్‌లలో అనుమానాస్పద అమెరికన్ పౌరులను లక్ష్యంగా చేసుకున్న రెండు కాల్ సెంటర్లను తాము ఛేదించినట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్‌పోల్ ద్వారా ఎఫ్‌బీఐ ఫిర్యాదు:
వీరంతా యూఎస్‌లో సైబర్ క్రైమ్‌లు నిర్వహిస్తున్నారని ఇంటర్‌పోల్ ద్వారా ఎఫ్‌బీఐ ఫిర్యాదు అందింది. అందువల్ల, ఈ దాడులకుసంబంధించిన సమాచారాన్ని ఆపరేషన్ చక్ర కింద ఎఫ్‌బిఐతో సీబీఐ కూడా పంచుకుంది. సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు సీబీఐ తాజాగా సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ తొలిసారిగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఉనికిని వెల్లడించింది. త్వరలో జరగనున్న ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీకి ముందు సీబీఐ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. అక్టోబరు 18 నుంచి ఇంటర్‌పోల్ మూడు రోజుల సాధారణ సభ జరగనుంది. ఈ మహాసభలో 195 దేశాలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సాధారణ సభకు ముందు, ఏజెన్సీ తన ఖాతాలను రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారు ఐడీ, సీబీఐ, సీఐవోతో సృష్టించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి