లాక్ డౌన్ విధింపు, ఆంక్షలపై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు, పరిస్థితిని బట్టి నిర్ణయాలు

| Edited By: Phani CH

Apr 26, 2021 | 8:30 PM

దేశంలో కోవిడ్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం పూనుకొంది. ఇందులో భాగంగా లాక్ డౌన్లు, ఆంక్షల విధింపు, కంటెయిన్మెంట్ జోన్లపై రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.

లాక్ డౌన్ విధింపు, ఆంక్షలపై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు, పరిస్థితిని బట్టి నిర్ణయాలు
Centres Rules For States On Lockdowns
Follow us on

దేశంలో కోవిడ్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం పూనుకొంది. ఇందులో భాగంగా లాక్ డౌన్లు, ఆంక్షల విధింపు, కంటెయిన్మెంట్ జోన్లపై రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. వారం రోజులుగా పాజిటివిటీ రేటు 10 శాతం పైగా ఉన్న పరిస్థితుల్లోనూ, ఆస్పత్రుల్లో పడకల వినియోగం 60 శాతం పైగా ఉన్న పరిస్థితుల్లోనూ ఆంక్షల అమలుకు ఇది తరుణమని సూచించింది. హోమ్ శాఖ స్పెసిఫై చేసిన నగరాలు, జిల్లాలు, ఆయా ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టి స్థానిక కంటెయిన్మెంట్ నెట్ వర్క్  ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. . జనాభా, భౌగోళిక, వైరస్ వ్యాప్తి చెందడానికి గల ప్రాంతాలను, హాస్పిటల్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, తదితరాలను గుర్తించి ఆ విశ్లేషణ ఆధారంగా కంటెయిన్మెంట్ జోన్ పరిధిఫై నిర్ణయం తీసుకోవాలని కూడా పేర్కొంది. లాక్ డౌన్ పై రాష్ట్రాలు పారదర్శకంగా వ్యవహరించాలని, ముఖ్యంగా  కంటెంయిన్మెంట్ జోన్ల విషయంలో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చూడాలని కోరింది. వారానికి  పాజిటివిటీ రేటు 10 శాతం పైగా ఉన్నా, ఆంటే 10 శాతం శాంపిల్స్ లో ఒకటి పాజిటివ్ గా తేలినా, ఆక్సిజన్ సపోర్టుతోనో, ఐసీయూలోనో 60 శాతం  పైగా కోవిడ్ రోగులున్నా  పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని ఈ గైడ్ లైన్స్ లో పేర్కొంది.

ఆంక్షలు 14 రోజులపాటు అమలు చేయాలని సూచించింది. అలాగే నైట్ కర్ఫ్యూ, పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లో సగం సిబ్బంది పని చేసేలా చూడాలని, పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి  మించకుండా   చూడాలని కేంద్రం సూచించింది. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, మత ప్రదేశాలు మూసి ఉండాలని,అత్యవసర సర్వీసులను నైట్ కర్ఫ్యూ వంటి సందర్భాల్లో మినహాయించాలని కోరింది. రవాణా వ్యవస్థకు భంగం ఉండబోదని పేర్కొంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: లాక్ డౌన్ ప్రసక్తే లేదు, కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటన, కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టీకరణ

Whatsapp: 24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్.. వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్‌..!