CBSE 12th Results 2021: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థుల కోసం అసెస్‌మెంట్ సిస్టమ్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) గురువారం సుప్రీం కోర్టులో సమర్పించే అవకాశం ఉంది. అయితే ఆబ్జెక్టివ్ మూల్యాంకన ప్రమాణాలను రెండు వారాల్లోగా రికార్డులో ఉంచాలని సీబీఎస్‌ఈని జూన్ 3న సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు12 మంది నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా తయారు చేసిన మూల్యాంకన ప్రమాణాలను ఈ వారం విడుదల చేయవచ్చని సీబీఎస్‌ఈ సీనియర్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.12వ తరగతి విద్యార్థులకు ఫలితాలు, మార్కులు ఇవ్వడానికి సూత్రాన్ని సిద్ధం చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీలో విద్యాశాఖ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి విపిన్ కుమార్ సహా 12 మంది ఉన్నారు. ఈ విషయంలో జూన్ 4న సీబీఎస్‌ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కమిటీ విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారి మార్క్‌ల షిట్స్‌ను తయారు చేసింది.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన సీబీఎస్‌ఈ .. విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై మార్గదర్శకాలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. జూన్ 20వ తేదీన ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 50 వేల మంది వరకు ఉన్నారు. అయితే గతంలో మాదిరిగానే అంతర్గత పరీక్షలు (ఇంటర్నల్ అసెస్‌మెంట్)కు 20 మార్కులు ఉంటాయి. వాటిని జూన్ 11వ తేదీ లోపు బోర్డుకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు పంపగా, మిగిలిన 80 మార్కులను పాఠశాలలో ఏడాది పొడవునా వివిధ పరీక్షల్లో విద్యార్థి సాధించిన ఫలితాల ఆధారంగా కేటాయించనున్నారు. అయితే పిరియాడిక్, యూనిట్ పరీక్షలకు 10, ఆరు నెలల, మిడ్‌టర్న్ పరక్షలకు 30, ఫ్రీ బోర్డు పరీక్షలకు 40 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఈ మార్కులు కేటాయించడానికి ప్రతి పాఠశాలలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటు చేశారు. దానికి ప్రిన్సిపల్ నేతృత్వం వహిస్తారు. మిగిలిన ఏడుగురు సభ్యుల్లో ఐదుగురు ఆ పాఠశాల ఉపాధ్యాయులు, మరో ఇద్దరిని మరో పాఠశాల నుంచి నియమించారు. అయితే ఆయా రికార్డులను సీబీఎస్ఈ బృందాలు కూడా తనిఖీ చేస్తాయి.