Rajya Sabha – CBI vacancies: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో ఉద్యోగాల ఖాళీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గతేడాది డిసెంబర్ 31 వరకు మొత్తం 1374 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభలో ప్రకటించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వంగా సమాధానమిచ్చారు. 2020 డిసెంబర్ 31 వరకు మొత్తంగా 1374 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు.
సీబీఐలో 7273 ఉద్యోగాలు మంజూరు కాగా.. 5899 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని జితేంద్రసింగ్ తెలిపారు. మొత్తం 5వేల ఎగ్జిక్యూటివ్ ర్యాంకు పోస్టుల్లో 4171 భర్తీ చేసినట్టు వెల్లడించారు. అలాగే, 1671 మినిస్టీరియల్ ర్యాంకు ఉద్యోగాలు భర్తీ కావాల్సి ఉండగా.. వాటిలో 1353 భర్తీ చేసినట్టు వివరించారు. క్యాంటీన్ సిబ్బంది 70మంది కావాల్సి ఉండగా.. 25 మందిని మాత్రమే భర్తీ చేసినట్టు పేర్కొన్నారు. అన్ని ర్యాంకుల నియామకాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జితేంద్ర సింగ్ రాజ్యసభ్యలో సమాధానమిచ్చారు.
Also Read:
Tamil Nadu: తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 11మంది సజీవదహనం..