AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

32 మంది రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు

తమిళనాడులో 32 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రీన్‌ వేకు వ్యతిరేకంగా వీరందరూ ఆందోళన చేపట్టగా.. తాజాగా వారిపై కేసు నమోదైంది.

32 మంది రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 09, 2020 | 9:14 AM

Share

తమిళనాడులో 32 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రీన్‌ వేకు వ్యతిరేకంగా వీరందరూ ఆందోళన చేపట్టగా.. తాజాగా వారిపై కేసు నమోదైంది. అయితే సేలం–చెన్నై మధ్య గ్రీన్ ‌వే పథకాన్ని రద్దు చేయాలన్న కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ కేసును త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకు ఇటీవల అప్పీల్‌ చేసింది. ఈ క్రమంలో గ్రీన్ వేకు వ్యతిరేకంగా సేలం జిల్లా లాలికాల్‌ పట్టిలో ఆందోళన చేసిన 21 మంది రైతులపై మల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కుల్లంపట్టిలో మరో 11 మంది రైతులపై కారిపట్టి పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ సోమవారం సేలం జిల్లా అయోద్యపట్నంలో 7వ మైల్, రామలింగపురంలో రైతులు నల్ల జెండాలతో తమ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.

Read This Story Also: క్వారంటైన్‌ సెంటర్‌లో కుక్కను ఉంచిన అధికారులు.. ఎందుకంటే..!

Follow Us
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
విజయదశమి ఆయుధ పూజ: ఎందుకు చేస్తారు? ఇంట్లో పూజించే విధానం..
విజయదశమి ఆయుధ పూజ: ఎందుకు చేస్తారు? ఇంట్లో పూజించే విధానం..
ఆ నలుగురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్
ఆ నలుగురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్
వైద్యం కోసం అప్పులు.. ఒక్క అనారోగ్యంతో పేదరికంలోకి!
వైద్యం కోసం అప్పులు.. ఒక్క అనారోగ్యంతో పేదరికంలోకి!
ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ 2027 విడుదల..
ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ 2027 విడుదల..
ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..
ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..
ముంబైలో పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
ముంబైలో పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
షాలిని కోసం ఆ కంటెస్టెంట్ బలి.. ఒక్కరోజులో మారిన లెక్కలు..
షాలిని కోసం ఆ కంటెస్టెంట్ బలి.. ఒక్కరోజులో మారిన లెక్కలు..
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100 శాతం టారిఫ్‌ల ముప్పు తప్పినట్లేనా
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100 శాతం టారిఫ్‌ల ముప్పు తప్పినట్లేనా
ప్రభుత్వ జాబ్ కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు
ప్రభుత్వ జాబ్ కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు