క్వారంటైన్‌కి కుక్కను తీసుకెళ్లిన వ్యక్తి.. పెద్ద కారణమే ఉందండోయ్..!

కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని, వైరస్‌ సోకిన వారితో కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్ సెంటర్‌కి తరలిస్తోన్న విషయం తెలిసిందే.

క్వారంటైన్‌కి కుక్కను తీసుకెళ్లిన వ్యక్తి.. పెద్ద కారణమే ఉందండోయ్..!
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2020 | 1:42 PM

కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని, వైరస్‌ సోకిన వారితో కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్ సెంటర్‌కి తరలిస్తోన్న విషయం తెలిసిందే. అయితే మనుషులు ఉండాల్సిన క్వారంటైన్‌ సెంటర్‌లోకి ఓ కుక్కకు అనుమతి ఇచ్చారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా క్వారంటైన్‌ సెంటర్‌లోకి కుక్కను తరలించడానికి వెనుక ఓ కారణం ఉంది.

వివరాల్లోకి వెళితే జమ్ముకశ్మీర్‌లోని తకురాయ్‌ గ్రామానికి చెందిన ఓ డ్రైవర్‌కి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనతో కాంటాక్ట్ అయిన వారందరినీ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు అధికారులు. వారిలో ఫిల్లార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నారు. అయితే ఆ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించే క్రమంలో తన కుక్కను కూడా తీసుకొస్తానని అతడు అధికారులతో చెప్పాడు. ఎందుకని అడగ్గా.. ”నేను ఈ కుక్కను పదివేలు పెట్టి తెచ్చుకున్నాను. నేను క్వారంటైన్ సెంటర్‌కి వస్తే ఈ కుక్కను చూసుకునేందుకు నా ఇంట్లో ప్రస్తుతం ఎవరూ లేరు. అందుకే నేను ఎక్కడుంటే నా కుక్క కూడా నాతో అక్కడే ఉంటుంది” అని తెలిపాడు. ఈ విషయంపై పైఅధికారులతో చర్చించిన అధికారులు.. క్వారంటైన్‌ సెంటర్‌లో కుక్కకు కూడా అనుమతిని ఇచ్చారు. ఇక అక్కడ ఆ వ్యక్తి తన కుక్క యోగక్షేమాలు చూసుకుంటుండగా.. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Read This Story Also: పదో తరగతి పరీక్షలు ఎన్నిసార్లు రద్దయ్యాయంటే..!