
జమ్మూలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది.. ఒక వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే అత్యవసరంగా రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా ఒక కారు డ్రైవర్ మొండిగా అడ్డుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జమ్మూలోని నాగ్రోటా ప్రాంతంలో ఓ కారు అంబులెన్స్‌కు అడ్డుపడింది. ఆ అంబులెన్స్ రోగిని కత్రాలోని ఆసుపత్రికి తీసుకెళ్తుంది. అయితే అంబులెన్స్ డ్రైవర్ ఎంత హారన్ కొట్టినా, ఆ కారు పదేపదే దారి ఇవ్వకుండా అడ్డుకుంది. దీనిని అంబులెన్స్‌లోని వ్యక్తి రికార్డ్ చేసి సోషల్పె మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.
వీడియో వైరల్ అయిన కొద్దిసేపటికే జమ్మూ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని నాగ్రోటా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ వాహనాన్ని సీజ్ చేసి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారు డ్రైవర్‌ను వెంటనే అరెస్ట్ చేశారు. అత్యవసర సేవలకు అడ్డుపడటం చట్టప్రకారం పెద్ద నేరం. అందుకే పోలీసులు ఆ డ్రైవర్‌కు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు. నెటిజన్లు మాత్రం అంబులెన్స్‌కు దారి ఇవ్వడం మనందరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు.