Car AirBags: ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్‌లు పని చేయకపోతే వారిదే బాధ్యత.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

Car AirBags: కారుకు ఎయిర్ బ్యాగ్ చాలా ముఖ్యం. ప్రమాద సమయంలో ఈ ఎయిర్ బ్యాగ్స్ వ్యక్తుల ప్రాణాలను కాపాడుతాయి.

Car AirBags: ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్‌లు పని చేయకపోతే వారిదే బాధ్యత.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
Air Bags

Updated on: Apr 23, 2022 | 2:06 PM

Car AirBags: కారుకు ఎయిర్ బ్యాగ్ చాలా ముఖ్యం. ప్రమాద సమయంలో ఈ ఎయిర్ బ్యాగ్స్ వ్యక్తుల ప్రాణాలను కాపాడుతాయి. ఇప్పటి వరకు ప్రతీ కారుకు రెండు ఎయిర్ బ్యాగులు తప్పనిసరిగా ఉండేవి. అయితే, ఎయిర్ బ్యాగుల విషయంలో తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్ పని చేయకపోతే సదరు కంపెనీయే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్ పని చేయకపోవడంపై శైలేంద్ర భట్నాగర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన ధర్మాసనం.. బాధితులకు రూ. 3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కార్లు తయారీ సంస్థ హ్యుందాయ్‌ను ఆదేశించింది.

శైలేంద్ర భట్నాగర్ 2015లో హ్యుందాయ్ క్రెటా కారును కొనుగోలు చేశారు. 2017లో కారు ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్ పని చేయకపోవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో కార్ సెఫ్టీ ఫీచర్స్‌ను సవాల్ చేస్తూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు శ్రైలేంద్ర. ఆ తరువాత కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎయిర్ బ్యాగ్ పని చేయకపోవడానికి బాధ్యత వహిస్తూ రూ.3 లక్షల నష్టపరిహారం అందించడంతో పాటు.. వాహనాన్ని రీప్లేస్ చేయాలని కూడా ఆదేశించింది.

జనవరి 1, 2022 నుండి డబుల్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనసరి..
ప్రయాణికుల భద్రతను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. జూలై 2019లో, అన్ని కార్లకు డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి చేసింది. జనవరి 1, 2022 నుండి కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ నిబంధనను తప్పనిసరి చేశారు. ఇప్పుడు కారులోని సీట్ల ఆధారంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చెప్పారు. ఎనిమిది సీట్ల వాహనాలకు అవసరమైన ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తయారు చేయాలని కంపెనీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నిబంధన అక్టోబర్ 1, 2022 నుంచి అమల్లోకి రానుంది.

Also read:

Hyderabad Weather Report: తెలంగాణ వాసులకు శుభవార్త.. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో..

Ukraine – Russia War: ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో కీలక పరిమాణం.. సంచలన ప్రకటన చేసిన పుతిన్..!

Kalyana Laxmi Scheme: కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులతో ఎమ్మెల్యే బిగాల ఆత్మీయ సమ్మేళనం.. తన స్వంత ఖర్చులతో..