COVID-19 Vaccine: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని బలవంతం చేయొద్దు.. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో కోవిడ్‌ వ్యాప్తి చెందదన్న ఆధారాలు లేవు

COVID-19 Vaccine: దేశంలో రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడికి తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక దేశ..

COVID-19 Vaccine: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని బలవంతం చేయొద్దు.. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో కోవిడ్‌ వ్యాప్తి చెందదన్న ఆధారాలు లేవు
Follow us

|

Updated on: May 06, 2022 | 8:57 PM

COVID-19 Vaccine: దేశంలో రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడికి తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతంగా జరిగింది. దీంతో కేసుల సంఖ్య కూడా భారీగానే తగ్గుముఖం పట్టింది. ఇక జూన్‌ నుంచి ఫోర్త్‌ వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. రాష్ట్రాలు కూడా ఎక్కువ మొత్తంలో వ్యాక్సినేషన్‌ (Vaccination) జరిగేలా చర్యలు చేపడుతోంది. ఇక ఇటీవల వ్యాక్సినేషన్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వ్యాక్సిన్‌ తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై మే 2వ తేదీన విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా పబ్లిక్‌ హెల్త్‌ పాలసీని ఆస్పత్రి లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో టీకాలు వేసుకోవాలనే అంశం సదరు వ్యక్తిపై ఆధార పడి ఉంటుందని, ఎవరిని కూడా వ్యాక్సిన్‌ తీసుకోవాలని బలవంతం చేయరాదని సుప్రీం కోర్టు సూచించింది. అయితే ఈ కోర్టు తీర్పును అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిన ప్రాంతాలు కూడా సమర్థించాయి.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ సంబంధించిన ఇందుకు సంబంధించిన విషయాలను వివరించింది. వాస్తవానికి ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను తప్పనిసరి వేయాలని చెప్పలేదని, కేవలం 100% వ్యాక్సినేషన్ అని మాత్రమే చెప్పినట్లు కేంద్రం తెలిపింది. ఒక వ్యక్తి వ్యాక్సినేషన్‌ గురించి అతని అనుమతి లేకుండా టీకా తీసుకోవాలనే అంశాన్ని ఉల్లంఘించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అందుకే ప్రతి ఒక్కరు టీకాలు తీసుకోవడం అనేది తప్పనిసరి కాదు. భారత రాజ్యాంగం ప్రకారం.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 దేశంలోని ఏ వ్యక్తి జీవితాన్ని లేదా స్వేచ్ఛను హరించరాదని చెబుతోంది. భారతదేశంలోని చట్టం ముందు సమానత్వం లేదా చట్టాల సమాన రక్షణను ఏ వ్యక్తికి నిరాకరించకూడదు. ఇది వారి ప్రాథమిక హక్కు అని పేర్కొంది. వ్యాక్సిన్‌ తీసుకోవాలని పబ్లిక్‌ పాలసీని ఏ ప్రభుత్వం రూపొందించదు. వ్యాక్సిన్‌ తీసుకోని వ్యక్తిలకు కోవిడ్‌ వ్యాపిస్తుందన్న విషయం ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. టీకా ప్రయోజనాలపై డేటాను క్రోడీకరించడం కూడా సాధ్యం కాదు. అలాగే వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తికి కోవిడ్‌ రాదనే భావన తప్పు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏమి లేవని కోర్టు తెలిపింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకుంటేనే కరోనా రాదనే మాట అవాస్తవమని తెలిపింది కోర్టు.

సాధారణ వ్యక్తి ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించవచ్చు. అంటే అతను టీకాలు వేసేందుకు ఎలాంటి బలవంతం చేయరాదు. COVID-19 మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర అధికారుల ఆదేశించడం సరైంది కాదని కోర్టు పేర్కొంది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికంటే తీసుకోని వారిలో కరోనా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు.. కానీ అందుకోసం కొన్ని పరిమితులు ఉండాలి. కరోనా కేసుల సంఖ్య తగ్గే వరకు సంబంధిత ఆదేశాలను పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో టీకాలు వేసుకోని వారిపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని సుప్రీంకోర్టు సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 ఇవి కూడా చదవండి:

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఈ ఏడాది ముందుగానే వడ్డీ జమ.. ఎప్పుడంటే..!

America: సింగిల్ డోస్ అని ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. రక్తం గడ్డ కడుతుందని యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరిక

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో