అయ్యో దేవుడా.. నా కష్టం పగోడికి కూడా రావొద్దు.. బిడ్డకు ఇంజెక్షన్లు ఇప్పించలేకపోతున్నా..

అతనో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. పెళ్లైంది.. కూతురు ఉన్నది.. అంతా బాగానే ఉన్నా.. కూతురికి చిన్నతనంలోనే డయాబెటిస్ వ్యాధి నిర్ధారణ అయింది. ఆమెకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తప్పనిసరి అని వైద్యులు చెప్పారు.. కానీ.. ఆ తండ్రికి.. ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇప్పించడం భారంగా మారింది.. ఓ వైపు అప్పుల భారం.. మరో వైపు చిన్నారికి వైద్యం అందించలేక.. తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు..

అయ్యో దేవుడా.. నా కష్టం పగోడికి కూడా రావొద్దు.. బిడ్డకు ఇంజెక్షన్లు ఇప్పించలేకపోతున్నా..
Up Crime News

Updated on: Jul 10, 2025 | 5:22 PM

అతనో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. పెళ్లైంది.. కూతురు ఉన్నది.. అంతా బాగానే ఉన్నా.. కూతురికి చిన్నతనంలోనే డయాబెటిస్ వ్యాధి నిర్ధారణ అయింది. ఆమెకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తప్పనిసరి అని వైద్యులు చెప్పారు.. కానీ.. ఆ తండ్రికి.. ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇప్పించడం భారంగా మారింది.. ఓ వైపు అప్పుల భారం.. మరో వైపు చిన్నారికి వైద్యం అందించలేక.. తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.. కన్న కూతురికి ఇంజెక్షన్ ఇప్పించలేకపోతున్నానన్న మనోవేదనతో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి.. తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.. ఈ షాకింగ్ ఘటన యూపీలో కలకలం రేపింది.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అప్పుల బాధతో బాధపడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త.. తన డయాబెటిక్ కుమార్తెకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇప్పించలేని స్థితిలో ఉన్నానని కాల్చుకుని చనిపోయాడు.. ఆత్మహత్యకు ముందు ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు.. ఆ తర్వాత తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.. పోలీసులు అతని గుర్తింపును వెల్లడించలేదు.. ఆ వ్యక్తి తన కార్యాలయంలో సెక్యూరిటీ గార్డు తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

తన మరణానికి కొద్దిసేపటి ముందు పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో.. వ్యాపారవేత్త తన కుటుంబానికి మద్దతు ఇవ్వాలని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలను వేడుకున్నాడు. అప్పులు – ఆర్థిక బాధ్యతల ఒత్తిడిని తాను ఇకపై భరించలేనని చెప్పుకొచ్చాడు.. వీడియోలో, డయాబెటిస్‌తో బాధపడుతున్న తన కుమార్తెకు.. ప్రాణాలను రక్షించే ఇన్సులిన్ కొనడానికి డబ్బు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయానని అతను చెప్పాడు.

ఫేస్‌బుక్ లైవ్ చూసిన అతని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దీంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి, అతను తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో అతను తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనయ్యాడని, గత కొన్ని సంవత్సరాలుగా కోట్లాది రూపాయల అప్పులు పేరుకుపోయాయని.. దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులపై, అతను గార్డు ఆయుధాన్ని ఎలా పొందాడనే దానిపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ప్రకటనలో తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..