కోవిద్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇవ్వలేం…..సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

| Edited By: Phani CH

Jun 20, 2021 | 10:17 AM

కోవిద్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారాన్ని ఇవ్వలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలా చెల్లించడం వల్ల డిజాస్టర్ రిలీఫ్ నిధులు పూర్తిగా అయిపోతాయని..

కోవిద్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇవ్వలేం.....సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
Supreme Court
Follow us on

కోవిద్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారాన్ని ఇవ్వలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలా చెల్లించడం వల్ల డిజాస్టర్ రిలీఫ్ నిధులు పూర్తిగా అయిపోతాయని..అసలు ఇది సాధ్యం కాదని పేర్కొంది. దేశంలో కోవిద్ మృతుల కుటుంబాలకు ఎంతో కొంత పరిహారం ఇవ్వాలని, కనీసం నాలుగు లక్షల ఎక్స్ గ్రేషియా అయినా ఇస్తే ఆ కుటుంబాలు సంతోషిస్తాయని పేర్కొంటూ దాఖలైన ఓ పిల్ ను సుప్రీంకోర్టు విచారించింది. దీనిపై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల్లో మరణాలకు సంబధించిన కేసుల్లో వాటికే పరిహారం వర్తిస్తుందని డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం చెబుతోందని కేంద్ర తరఫు లాయర్ చెప్పారు. కోవిద్ పాండమిక్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 4 లక్షల మంది కోవిద్ రోగులు మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలా మరణించిన వారి ప్రతి కుటుంబానికి నాలుగు లక్షల చొప్పున చెల్లిస్తూ పోతే.,.రాష్ట్రాలకు అందజేసే నిధులు లేకుండా పోతాయని ఆ లాయర్ చెప్పారు. ఉదాహరణకు వరదలు, తుఫానులు వంటివి సంభవించినప్పుడు మృతుల కుటుంబాలను ఆదుకునేందుకో, తక్షణ వైద్య సౌకర్యాలు కల్పించేందుకో …రాష్ట్రాలకు నిధులు లేక వెసులుబాటు ఉండదని కేంద్రం వివరించింది.

అయితే ఇన్సూరెన్స్ క్లెయిములను జిల్లా కలెక్టర్లు ప్రాసెస్ చేస్తున్నారని, ఈ సదుపాయం కవరేజీ కింద రూ. 442.4 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని, అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వానికి అభ్యంతరం లేదని కేంద్రం వెల్లడించింది. కాగా ఇండియాలో కోవిద్ కేసులు తగ్గుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఏమైనా.. కేంద్రం వాదనతో.. ఇక తమకు ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక

 

మరిన్ని ఇక్కడ చూడండి: ప్రజలు ‘అలాంటివారిని చెప్పుతో కొడతారు’…….కాంగ్రెస్ నేతలపై పరోక్షంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు

Gas Cylinder For 10 Rupees : ఈ కంపెనీ బంపర్ ఆఫర్..! 10 రూపాయలకే గ్యాస్ సిలిండర్..? మీరు కూడా అర్హులే..