సెల్‌ఫోన్స్ కొంటే.. ఉల్లిపాయలని ఫ్రీగా ఇస్తామంటూ.. ఓ మొబైల్ షాపు మంచి ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు.. పసిడి కన్నా.. ఉల్లి మరింత బరువైంది. దేశవ్యాప్తంగా ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో.. విదేశాల నుంచి దిగుమతి తీసుకుంటున్నా.. సరిపోవడంలేదు. నిన్న పెరిగిన రేట్లతో.. ఉల్లి పాయలను కొనాలంటే.. ఎవరూ ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్‌లోని రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి.. రూ.175లు పలుకుతుంటే.. హోల్‌సెల్‌గా రూ.150లకు దొరుకుతున్నాయి. ఉల్లి కొరత తీవ్రంగా ఉండటంతో.. దేశవ్యాప్తంగా.. ఆనియన్స్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
అయితే.. పెరిగిన ఉల్లి ధరలపై.. చాలా మంది సోషల్ మీడియాలో.. హాస్యాస్పదంగా.. పలు స్కిట్‌లను ట్రోల్ చేస్తున్నారు. అలాగే.. ఇప్పుడు మా షాప్‌లో సెల్‌ఫోన్లను కొంటే.. ఉల్లిపాయలను ఫ్రీగా ఇస్తామంటూ.. యూపీలోని ఓ వ్యక్తి ఆఫర్‌ని ప్రకటించాడు. ప్రస్తుతం ఇది ఫుల్‌గా వైరల్ అవుతోంది. లాగురాబిర్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్ యజమాని.. స్మార్ట్ ఫోన్ కొంటే.. కిలో ఉల్లి ఫ్రీ అంటూ బోర్డు పెట్టారు. దీంతో.. సెల్‌ఫోన్స్ కొనుక్కునే వారు చాలా మంది ఆ షాపుకు క్యూ కడుతున్నారు.