Bulldozing Justice: హరియాణాలో రంగంలోకి బుల్డోజర్లు.. నూహ్‌ అల్లర్లలో పాల్గొన్న నిందితులు అక్రమ వలసదారులుగా గుర్తింపు.. గుడిసెల కూల్చివేత

|

Aug 05, 2023 | 7:26 AM

బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించి.. అసోం నుంచి ఇక్కడకు వచ్చి స్థలాలు కబ్జా చేసిన "అక్రమ" వలసదారులు నుహ్ జిల్లాలోని తౌరు పట్టణంలోని మహ్మద్‌పూర్ రహదారి వెంట వార్డు నంబర్ వన్‌లోని హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. సుమారు ఒక ఎకరం స్థలంలో 250కి పైగా గుడిసెలు నిర్మించగా, వారు గత నాలుగేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు హరియాణా పట్టణాభివృద్ధి శాఖ చెబుతోంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా.. రాళ్లదాడులు, దుకాణాల లూటీల్లో పాల్గొన్నట్లు గుర్తించారు పోలీసులు.

Bulldozing Justice: హరియాణాలో రంగంలోకి బుల్డోజర్లు.. నూహ్‌ అల్లర్లలో పాల్గొన్న నిందితులు అక్రమ వలసదారులుగా గుర్తింపు.. గుడిసెల కూల్చివేత
Bulldozing Justice
Follow us on

హరియాణాలోని నూహ్‌ జిల్లాలో హింసాకాండకు కారణమైన వారిని గురించింది ప్రభుత్వం.. అంతేకాదు   అల్లర్లకు కారణమైన నిందితులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించిన హరియాణా సర్కార్‌.. యోగీ స్టైల్‌ ట్రీట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టింది. అల్లర్లకు పాల్పడ్డ వారిని గుడిసెలను బుల్డోజర్లతో కూల్చి వేసింది. హరియాణా ప్రభుత్వం.. యూపీ సర్కార్‌ బాటలో పయనిస్తోంది. దానిలో భాగంగా.. నూహ్‌ జిల్లాలో అల్లర్లకు కారకులైన నిందితులపై హరియాణా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొందరు నిందితులను గుర్తించిన అధికారులు.. నూహ్‌ జిల్లా తావుడులో వారికి చెందిన 250 గుడిసెలను బుల్డోజర్లతో కూల్చివేశారు. ఈ ఆపరేషన్‌లో భారీ సంఖ్యలో పోలీస్ బలగాలు పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదేశాలతోనే కూల్చివేతలు జరిగినట్లు తెలుస్తోంది. అక్రమంగా వలస వచ్చిన కొందరు అల్లర్లలో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు.

బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించి.. అసోం నుంచి ఇక్కడకు వచ్చి స్థలాలు కబ్జా చేసిన “అక్రమ” వలసదారులు నుహ్ జిల్లాలోని తౌరు పట్టణంలోని మహ్మద్‌పూర్ రహదారి వెంట వార్డు నంబర్ వన్‌లోని హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. సుమారు ఒక ఎకరం స్థలంలో 250కి పైగా గుడిసెలు నిర్మించగా, వారు గత నాలుగేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు హరియాణా పట్టణాభివృద్ధి శాఖ చెబుతోంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా.. రాళ్లదాడులు, దుకాణాల లూటీల్లో పాల్గొన్నట్లు గుర్తించారు పోలీసులు.

ఆ మేరకు దాడులు చేస్తున్న ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. ఇదే విధమైన ఆపరేషన్‌ను నల్హార్‌ గ్రామంలోనూ పోలీసులు చేపట్టారు. ఆగ్రామంలో భారీ సంఖ్యలో వాహనాలను కొందరు దహనం చేశారు. నూహ్‌ అల్లర్ల వెనుక ఉన్న 50 మంది కుట్రదారులను పోలీసులు గుర్తించారు. నూహ్‌ అల్లర్లలో పాల్గొన్న వారిలో చాలా మంది విధ్వంసకారులు.. అరెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని ఆరావళీ పర్వతాల్లో నక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిపై స్థానికంగా 45 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు గురుగావ్‌ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మొత్తంమీద, గురువారం నుహ్ , గురుగ్రామ్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. నూహ్‌లో రెండు గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. నుహ్, గురుగ్రామ్, ఫరీదాబాద్ మరియు పల్వాల్‌లో మూడు గంటల పాటు ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించబడ్డాయి. భివానీ తాజా అదనంతో 10 హర్యానా జిల్లాల్లో ఇప్పుడు సెక్షన్ 144 అమలులో ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..