‘అక్కడా ఓ దళిత బంధు’.. ల్యాండ్ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో వారికి ఇళ్ళు కట్టిస్తామన్న యూపీ సీఎం

| Edited By: Phani CH

Aug 19, 2021 | 6:09 PM

ల్యాండ్ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో దళితులకు, పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు., యూపీ అసెంబ్లీలో గురువారం మాట్లాడిన ఆయన..

అక్కడా ఓ దళిత బంధు.. ల్యాండ్ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో వారికి  ఇళ్ళు కట్టిస్తామన్న యూపీ సీఎం
Yogi Adityanath
Follow us on

ల్యాండ్ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో దళితులకు, పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు., యూపీ అసెంబ్లీలో గురువారం మాట్లాడిన ఆయన..2017 లో తమ ప్రభుత్వం ఎర్పడిన తరువాత యాంటీ లాండ్ మాఫియా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందని..ఆ సంస్థ ఇప్పటివరకు 67 వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నదని చెప్పారు. ఇవన్నీ రెవెన్యూ శాఖకు చెందినవని ఆయన తెలిపారు. అధికారంలో ఉన్నవారు దర్జాగా అక్రమంగా కబ్జా చేసిన భూములు కూడా వీటిలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీటిలో స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఏర్పాటుకు ప్రాధాన్యతనిచ్చామని..స్కూళ్ల సమీపంలో ఈ భూములు ఉన్న పక్షంలో పిల్లల క్రీడలకు ఇవి సౌలభ్యంగా ఉంటాయని భావించామని, అలాగే గ్రామీణులు తమ సభలను నిర్వహించుకోవడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆయన చెప్పారు. ఏది ఏమైనా.. దళితులు, పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలని ప్రతిపాదించామన్నారు. గత ఫిబ్రవరిలోనే విధాన పరిషత్ కలో తానీ మేరకు ప్రకటన చేశానన్నారు.

మాఫియా ముఠాల నుంచి 67 వేల ఎకరాలను విముక్తం చేశామని, ఇక ఈ భూముల్లో పేదలకు ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని యోగి వెల్లడించారు. రాష్ట్రంలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఆయన.. పంచాయత్ లలో 46 శాతం మంది. బ్లాకు స్థాయి ఎన్నికల్లో 56 శాతం మంది మహిళలు ఎన్నికయ్యారని చెప్పారు. కొంతమంది (విపక్షాలు) తాలిబన్లను సమర్థిస్తున్నారని, వారే మళ్ళీ మహిళా సంక్షేమం గురించి గొంతు చేయించుకుంటున్నారని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. వారి నిర్వాకాన్ని బట్టబయలు చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో యోగి ఆదిత్యనాథ్… దళిత కార్డును ప్రస్తావించడం విశేషం.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Crime News: భోజనంలో మత్తు మందు కలిపి భర్తకు కరెంట్​ షాక్​.. ఆ తర్వాత సీన్ రివర్స్

AP Corona Cases: ఏపీలో మరోసారి కలవరం.. పెరిగిన పాజిటివ్ కేసులు.. వైరస్ బారినపడి 10మంది మృతి