Mayawati: మరో బ్రాహ్మణ నేతపై పార్టీ బహిష్కరణ వేటు.. బీఎస్పీ అధినేత్రి మాయవతి సంచలన నిర్ణయం..!

|

Apr 18, 2022 | 8:30 AM

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ పక్షాళనకు స్వీకారం చుట్టారు బీఎస్పీ అధినేత్రి మాయవతి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డినవారిపై చర్యలు చేపట్టారు.

Mayawati: మరో బ్రాహ్మణ నేతపై పార్టీ బహిష్కరణ వేటు.. బీఎస్పీ అధినేత్రి మాయవతి సంచలన నిర్ణయం..!
Mayawati
Follow us on

BSP Chief Mayawati: ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) పక్షాళనకు స్వీకారం చుట్టారు బీఎస్పీ అధినేత్రి మాయవతి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారంటూ తన విశ్వసనీయ సహాయకుడు, మాజీ మంత్రి నకుల్ దూబేను తొలగించిన మరుసటి రోజే మరో కీలక నేత అనిల్ పాండేను బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదివారం బహిష్కరించారు. హెచ్చరికలు ఉన్నప్పటికీ తన పని శైలిని మెరుగుపరుచుకోనందుకు అతనిపై చర్యలు తీసుకున్నట్లు మాయవతి పేర్కొన్నారు.

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నుంచి అనిల్ పాండే బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. దూబే తర్వాత రెండు రోజుల్లో ఉద్వాసనకు గురైన రెండో బ్రాహ్మణ నాయకుడు పాండే కావడం యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో లక్నోలోని సరోజినీనగర్ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జలీస్ ఖాన్ పార్టీ లక్నో మహానగర్ యూనిట్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మాయావతి ఒక ముస్లిం నాయకుడికి పెద్ద బాధ్యతను అప్పగించిన మరో ఉదాహరణ ఇది. యూపీ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం తరువాత, మాయావతి దానిని బలమైన సంస్థగా పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె ప్రతి నెలా తనకు నివేదించే రాష్ట్ర స్థాయి సమన్వయకర్తలను నియమించారు. పార్టీ నాయకుల కార్యకలాపాలను చూడటం కూడా ఇందులో ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదిలావుంటే, పార్టీ నుండి బహిష్కరణ తర్వాత, మాజీ మంత్రి నకుల్ దూబే ఆదివారం మాయావతిపై ఎదురుదాడికి దిగారు. నాకు, నా సమాజానికి న్యాయం జరిగిందన్నారు. మీతో కలిసి సర్వ సమాజ్‌తో కలిసి నిరంతరంగా కొనసాగుతున్న వింత వాతావరణం నుంచి నాకు విముక్తి కల్పించినందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

శనివారం, మాజీ మంత్రి దూబే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు BSP నుండి బహిష్కరించబడ్డారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు మాజీ మంత్రి నకుల్ దూబే (లక్నో)ను బీఎస్పీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి సాయంత్రం ట్వీట్ చేశారు. BSPలో బ్రాహ్మణ నాయకుడిగా స్థిరపడిన నకుల్ దూబే. 2007లో మాయావతి నేతృత్వంలోని BSP ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు.

Read Also….  Ayyannapathrudu: మాజీ మంత్రి అయన్న పాత్రుడు సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు