Drone Challenge: బోర్డర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..! అర్నియా సెక్టార్‌లో కనిపించిన మరో డ్రోన్‌..!

భారత్‌, పాక్‌ బోర్డర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..కొద్దిరోజులుగా డ్రోన్ల కలకలం..వారం రోజులుగా డ్రోన్‌ దాడులకు విఫలయత్నం చేస్తున్నాయి ముష్కర మూకలు.. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్‌లో ఓ డ్రోన్‌ కలకలం సృష్టించింది. అర్నియా సెక్టార్‌లో...

Drone Challenge: బోర్డర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..! అర్నియా సెక్టార్‌లో కనిపించిన మరో డ్రోన్‌..!
drone

Updated on: Jul 02, 2021 | 12:04 PM

భారత్‌, పాక్‌ బోర్డర్‌లో టెన్షన్‌..టెన్షన్‌..కొద్దిరోజులుగా డ్రోన్ల కలకలం..వారం రోజులుగా డ్రోన్‌ దాడులకు విఫలయత్నం చేస్తున్నాయి ముష్కర మూకలు.. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్‌లో ఓ డ్రోన్‌ కలకలం సృష్టించింది. అర్నియా సెక్టార్‌లో డ్రోన్‌ను గుర్తించిన భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. ఈ తెల్లవారుజామున పాక్‌ నుంచి భారత్‌వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అలర్టైన భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.

జమ్ముకశ్మీర్‌లో మరోమారు డ్రోన్ల కలకలం చెలరేగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌ సరిహద్దులు దాటడానికి ప్రయత్నించింది. గుర్తించిన BSF సైనికులు దానిపై కాల్పులు జరిపారు. వెంటనే అది అటు నుంచి వెనక్కి మళ్లిందని BSF అధికారులు వెల్లడించారు. డ్రోన్‌ ద్వారా రెక్కీ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

గత ఆదివారం కూడా డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ రోజు తెల్లవారుజామున ఎయిర్ పోర్టులో పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసును ఎన్‌ఐఏ విచారిస్తోంది. గత కొద్ది రోజులుగా జమ్ములోని చాలాప్రాంతాల్లో డ్రాన్లు   24 గంటలు గడవకముందే అంటే.. ఆదివారం రాత్రి 11.45 గంటలకు రత్నచక్‌, కాలూచక్‌ సైనిక ప్రాంతంలో ఒక డ్రోన్‌, అర్ధరాత్రి 2.40 గంటలకు ఇంకో డ్రోన్‌ తిరిగాయి. వీటి కదలికలను గుర్తించిన సైన్యం 25 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అవి అక్కడ నుంచి కనిపించకుండా పోయాయి.

ఇవి కూడా చదవండి : Drug Racket: నిన్న టెర్రర్ లింక్.. ఇవాళ డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు విదేశీ విద్యార్థులు అరెస్ట్

Hyderabad Metro Timings: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక పరుగుల సమయం మారింది.. గమనించారా..