Bandi Sanjay: బండి సంజయ్‌ తీరుపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు..

MLC Kavitha: బండి సంజయ్‌ తీరుపై BRS శ్రేణులు భగ్గుమన్నాయి. కవితను అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా అంటూ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Bandi Sanjay: బండి సంజయ్‌ తీరుపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు..
Bandi Sanjay

Updated on: Mar 11, 2023 | 1:31 PM

బండి సంజయ్‌ తీరుపై BRS శ్రేణులు భగ్గుమన్నాయి. కవితను అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా అంటూ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మాటలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ముందు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

బండి తీరుపై ఎంపీ మాలోతు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని డిమాండ్ చేశారు. కవితకు క్షమాపణలు చెప్పకపోతే తీవ్రపరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..