Wedding: పెళ్లి పీటలపై ఆగలేకపోయిన వరుడు.. అతిథులకు షాకిస్తూ వధువు ఏం చేసిందో తెలుసా..?

|

Dec 01, 2022 | 7:32 PM

అట్టహాసంగా పెళ్లి వేడుక జరుగుతోంది.. జయమాల కార్యక్రమంలో వరుడు.. వధువుకు పూలదండ వేస్తూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు.. వరుడి ప్రవర్తనతో షాకైన వధువు..

Wedding: పెళ్లి పీటలపై ఆగలేకపోయిన వరుడు.. అతిథులకు షాకిస్తూ వధువు ఏం చేసిందో తెలుసా..?
Marriage
Follow us on

అట్టహాసంగా పెళ్లి వేడుక జరుగుతోంది.. జయమాల కార్యక్రమంలో వరుడు.. వధువుకు పూలదండ వేస్తూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు.. వరుడి ప్రవర్తనతో షాకైన వధువు.. పెళ్లినే క్యాన్సిల్ చేసుకుంది. అసభ్యకరంగా ప్రవర్తించిన వరుడిని పెళ్లి చేసుకోనంటూ తల్లిదండ్రులు, బంధువులకు చెప్పింది.. దీంతో ఈ వివాహ వేడుక కాస్త.. ఘర్షణకు దారి తీసింది. చివరకు ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఈ ఘటన సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌ బదౌన్ జిల్లాలోని బిల్సీలో చోటుచేసుకుంది. జయమాల వేస్తున్న సమయంలో వరుడు తనకు ముద్దు పెట్టాడని ఆగ్రహించిన వధువు పెళ్లి రద్దు చేసుకుందని పోలీసులు తెలిపారు. దీంతో ఇరుకుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని.. చివరకు పెళ్లికూతురు పెళ్లిని రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ షాకింగ్ ఘటన యూపీ సంభాల్‌లోని బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బదాయూలోని బిల్సీకి చెందిన యువకుడికి బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నవంబర్ 26న వివాహం నిశ్చమైంది.

ఇరు కుటుంబాల అంగీకారంతో సోమవారం రాత్రి వరుడు అతడి కుటుంబ సభ్యులతో మేళతాళాలతో వధువు గ్రామానికి ఊరేగింపుగా చేరుకున్నాడు. వరుడిని వధువు కుటుంబసభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి వివాహవేడుక మొదలైంది. జయమాల కార్యక్రమంలో వరుడు.. వధువు మెడలో మాల వేస్తున్న సమయంలో ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిని చూసిన కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేయగా.. మరికొందరు వరుడికి వత్తాసు పలికారు.

అయితే, వరుడు పదే పదే అసభ్యకర పనులు చేయడంతో వధువు మనస్తాపానికి గురైంది. అతనిని పెళ్లి చేసుకోనంటూ వధువు మండపంలోనే తేల్చిచెప్పింది. దీంతో వధువు, వరుడు కుటుంబసభ్యులు ఒకరినొకరు గొడవకు దిగారు. అనంతరం పంచాయతీ నిర్వహించినా వధువు.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఇవి కూడా చదవండి

అనంతరం పెళ్లికొడుకుతో పాటు అతని తండ్రి, బంధువులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక్కడ కూడా ఇరువర్గాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ పంకజ్‌ లావానియా తెలిపారు. ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..