Brahamdev Mandal: కరోనా వ్యాక్సిన్ 11 డోసులు తీసుకున్నట్లు ఓ వృద్ధుడు చేసిన ప్రకటన బీహార్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వృద్ధుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. మాధేపుర జిల్లాకు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు బ్రహ్మదేవ్ మండల్.. తాను 11 సారల్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నానంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాను ఎప్పుడు కూడా ఆధార్ కార్డు చూపించి వ్యాక్సిన్ తీసుకునేవాడినని.. వెల్లడించాడు. అలా తాను 11 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపాడు. 2021, ఫిబ్రవరి 13న తాను మొదటి డోసు తీకున్నానని.. డిసెంబర్ వరకు మొత్తం 11 వ్యాక్సిన్ డోసులు వేయించుకున్నట్లు చెప్పాడు. 12వ డోసు తీసుకునేందుకు చౌసా పీహెచ్‌సీకి వెళ్లగా.. అక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగిసిందంటూ విచారం వ్యక్తంచేశాడు.
కోవిడ్ వ్యాక్సిన్ 11 డోసులు తీసుకున్నప్పటికీ తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది రాలేదంటూ వెల్లడించాడు. తాను ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నానో రాసి పెట్టుకున్నానని పేర్కొన్నాడు. అయితే.. బ్రహ్మదేవ్ మండల్ ప్రకటన అనంతరం అధికారులు స్పందించారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో అధికారుల ఫిర్యాదు మేరకు పురైనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బ్రహ్మదేవ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: