Odisha Train Accident: ‘తల్లిదండ్రులు మరణించడంతో.. పిల్లాడు ఏడ్చిఏడ్చి చనిపోయాడు’

|

Jun 03, 2023 | 2:53 PM

ఈ ప్రమాదంలో గాయపడిన కొందరికి బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ మెడికల్ కాలేజీలో, కొందరిని కటక్‌లోని ఎస్‌సీబీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒడిశా ప్రభుత్వం ఇవాల్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వ వేడుకలను రద్దు చేసినట్లు ప్రకటించింది.

Odisha Train Accident:  ‘తల్లిదండ్రులు మరణించడంతో.. పిల్లాడు ఏడ్చిఏడ్చి చనిపోయాడు’
Tutu Viswal (Photo Credit: BBC)
Follow us on

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో గుండె తరుక్కుపోయే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ బోగీల కింద చిక్కుకుని నుజ్జునుజ్జయి కొందరు ప్రయాణికులు ప్రాణాలు విడిచారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వందలమంది పాక్షికంగా గాయపడ్డారు.  ఈ ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి టుటు విశ్వాల్ కీలక వివరాలను బీబీసీ వార్తా సంస్థతో పంచుకున్నారు. “మా ఇల్లు ప్రమాదస్థలికి దగ్గరిలోనే ఉంది. నేనే ఇంట్లో ఉండగా శబ్ధం వచ్చింది. వచ్చి చూస్తే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు యాక్సిడెంట్ అయి ఉంది. అది గూడ్స్‌పైకి ఎక్కేసింది. చాలామంది గాయపడి.. చనిపోయి ఉండటం మేము గమనించాం. కొందర్ని మేం బయటకు తీయగలిగాం. అమ్మానాన్నలు ఇద్దరూ చనిపోవడంతో.. వారి పిల్లాడు కూడా ఏడ్చి ఏడ్చి చనిపోయాడు. చాలామంది నీళ్లు కావాలని అడిగారు. తీవ్రంగా గాయపడిన కొందర్ని మేం దగ్గర్లోని పోస్టాఫీస్ వద్దకు తీసుకెళ్లగలిగాం. వాళ్లు మా కాళ్లపై పడి. మీరు దేవుడితో సమానం. మమల్ని కాపాడారు అని అన్నారు” అని టుటు విశ్వాల్ పేర్కొన్నారు.

ఒడిషాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 261 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కోల్‌కతా-షాలీమార్‌ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పాయి. ఆగి ఉన్న గూడ్స్‌ రైలు ఈ ప్రమాద తీవ్రతను మరింత పెంచింది. ఈ ప్రమాదంలో రెండు ప్యాసింజర్‌ రైలు బోగిలు నుజ్జు నుజ్జయయ్యాయి. శుక్రవారం రాత్రి సుమారు ఏడు గంటలు – ఏడున్నర గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ధాటికి కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగిలు రైలు నుంచి విడిపోయి దాదాపు 50 మీటర్ల దూరంలో పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు ప్రమాదతీవ్రతను. ఈ తీవ్రతకు రైలు డోర్లు, కిటికీలన్నీ మూసుకుపోయాయి. దీంతో ఆ బోగిల్లో చిక్కుకున్నవారంతా బయటకు రాలేకపోయారు. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మిగిలిన బోగిలు ఆగి ఉన్న గూడ్స్‌ రైలుపైకి ఎక్కాయి. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన జనరల్‌, స్లీవర్‌, ఎసీ టూ టియర్‌, త్రీ టియర్‌ కోచ్‌లు సహ మొత్తం 13 బోగిలు పట్టాలు తప్పాయని అధికారులు తెలిపారు. బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు బోగిలు కూడా పట్టాలు తప్పాయి.

ఏ రైలు ఏ రైలును ఢీకొట్టిందనే విషయంలో రైల్వే అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. అంతా నిమిషాల వ్యవధిలోనే జరగడంతో సహాయక చర్యలకే అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎటు చూసినా మృతదేహాలు, సామాన్లుచెల్లచెదురుగా కనిపిస్తున్నాయి. వందల సంఖ్యలో మృతదేహలు ఒక చోటే పేర్చడం ఆ దృశ్యాలు చూసేందుకు భయంగొల్పుతున్నాయి. NDRF, ఒడిషా, బెంగాల్‌కు చెందిన రెస్క్యూ టీమ్స్‌ సిబ్బంది దాదాపు రెండు వేల మంది సహయక చర్యల్లో పాల్గొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..