అదానీ వ్యవహారంపై అట్టుడికిన లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. సభలో చర్చ జరగకుండా బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించాయి విపక్షాలు. పార్లమెంట్ నుంచి విజయ్‌చౌక్ వరకు విపక్షాలు తిరంగా ర్యాలీని చేపట్టాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి.
సభ సజావుగా నడవకపోవడానికి ప్రధాని మోదీనే కారణమని విమర్శించారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. పాత రైళ్లకు కొత్త ఇంజన్‌లు బిగించి పచ్చజెండా ఊపడం మోదీకి అలవాటుగా మారిందన్నారు . తమ హయాంలో కూడా ఎన్నో రైళ్లను ప్రారంభించామని , కాని ఎప్పుడు ప్రచారం చేసుకోలేదన్నారు
పార్లమెంట్ సజావుగా సాగకపోవడానికి బీజేపీ సభ్యుల తీరే కారణమన్నారు బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు. అదానీ వ్యవహారంపై విపక్షాల ఐక్య పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Lok Sabha adjourned Sine Die on the last day of Budget session of Parliament following protest by Opposition MPs over various issues pic.twitter.com/lUUZmGpKcV
— ANI (@ANI) April 6, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..