AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ.. కీలక ఆదేశాలు జారీ చేసిన బాంబే హైకోర్టు

మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ కోసం కేసును సీబీఐకి అప్పగించాలని బాంబే హైకోర్టు నిర్ణయించింది.

మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ.. కీలక ఆదేశాలు జారీ చేసిన బాంబే హైకోర్టు
Cbi Inquiry On Maharashtra Home Minister Anil Deshmukh
Balaraju Goud
|

Updated on: Apr 05, 2021 | 12:44 PM

Share

home minister anil deshmukh case: మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ కోసం కేసును సీబీఐకి అప్పగించాలని బాంబే హైకోర్టు నిర్ణయించింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ క‌మిష‌న‌ర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై అమేరకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లో ఈ విచార‌ణ పూర్తి చేయాల‌ని కోర్టు స్పష్టం చేసింది.

విధి నిర్వహణలో అవినీతికి పాల్పడ్డారంటూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై మాజీ ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మార్చి 31న బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరమ్ బీర్ సింగ్ తరఫు న్యాయవాది విక్రమ్ నంకని హాజరై వాదనలు వినిపించారు. ఈ కేసులో మరో మూడు పిటిషన్లు కూడా విచారణకు వచ్చాయి. వీటిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జి.ఎస్. ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అనిల్ దేశ్‌ముఖ్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

హోంమంత్రిపై తాను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఫిర్యాదు చేసిన కార‌ణంగానే త‌న‌ను బ‌దిలీ చేశార‌ని ప‌ర‌మ్ బీర్ సింగ్ ఆరోపించారు. పోలీసు అధికారుల‌కు నెల‌కు రూ.100 కోట్ల వ‌సూళ్ల ల‌క్ష్యం విధించార‌ని, అక్రమ బదిలీలు చేశార‌ని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ప‌రంబిర్ ఆరోప‌ణ‌లు గుప్పించారు.

గ‌త విచార‌ణ‌లో ఈ ఆరోప‌ణ‌ల‌పై ఎందుకు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేదంటూ బాంబే హైకోర్టు పరమ్ బీర్ సింగ్‌ను ప‌దే ప‌దే ప్రశ్నించింది. కేసులో హోంమంత్రి, ముఖ్యమంత్రి ఉన్నార‌ని చ‌ట్టాల‌ను ప‌క్కన పెడ‌తారా? ప్రధాని జోక్యం ఉంటే ఎవ‌రు విచార‌ణ జ‌రుపుతారు? బ‌య‌టి నుంచి అతీత శ‌క్తులు ఏవైనా వ‌స్తాయా అని విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ ప్రారంభించాలని డాక్టర్ జైశ్రీ పాటిల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు సీబీఐని కోరింది. అనిల్ దేశ్ ముఖ్, మీరు హోంమంత్రి కింద మహారాష్ట్ర పోలీసులు ఉన్నారు. పోలీసుల దర్యాప్తులో విచారణను సరిగ్గా నిర్వహించలేరు. దీంతో, కోర్టు సీబీఐకి ప్రాథమిక విచారణ ఇచ్చిందని న్యాయవాది జైశ్రీ పాటిల్ తెలిపారు. దీంతో హకోర్టు ధర్మాసనం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Read Also…  Corona Cases India: భారత్‌లో మళ్లీ పడగ విప్పిన కరోనా.. ఒక్క రోజులో లక్ష కేసులు.. యూఎస్ తర్వాత.!