Raj Babbar: ప్రముఖ నటుడు, కాంగ్రెస్ నేతకు రెండేళ్ల జైలు శిక్ష.. జరిమానా.. 26 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు..

|

Jul 08, 2022 | 7:14 AM

Raj Babbar: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, కాంగ్రెస్ నాయకుడు రాజ్ బబ్బర్ కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. 26 ఏళ్ల నాటి కేసులో ఆయ‌న దోషిగా తేల‌డంతో జైలుశిక్షతో పాటు జరిమానా విధించాడు. 1996 ఎన్నికల్లో పోలింగ్ అధికారిపై దాడి చేసిన కేసులో రాజ్ బబ్బర్‌ను..

Raj Babbar: ప్రముఖ నటుడు, కాంగ్రెస్ నేతకు రెండేళ్ల జైలు శిక్ష.. జరిమానా.. 26 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు..
Raj Babbar
Follow us on

Raj Babbar: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, కాంగ్రెస్ నాయకుడు రాజ్ బబ్బర్ కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. 26 ఏళ్ల నాటి కేసులో ఆయ‌న దోషిగా తేల‌డంతో జైలుశిక్షతో పాటు జరిమానా విధించాడు. 1996 ఎన్నికల్లో పోలింగ్ అధికారిపై దాడి చేసిన కేసులో రాజ్ బబ్బర్‌ను దోషిగా నిర్ధారించింది ఉత్తర ప్రదేశ్ కోర్టు. ఈమేరకు ప్రత్యేక అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. కాంగ్రెస్‌ నేతకు రెండేళ్ల జైలుశిక్ష తోపాటు రూ.6,500 జరిమానా విధించింది. కాగా ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ సింగ్ యాదవ్ విచారణ సమయంలో మరణించాడు. తరువాత కోర్టు రాజ్ బబ్బర్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేసింది. తీర్పుపై అప్పీల్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది.

హైకోర్టులో సవాలు చేస్తా!

కేసు విషయానికి వస్తే.. 1996 మేలో ఎన్నికల సందర్భంగా ఓ పోలింగ్ అధికారిపై రాజ్ బబ్బర్ దాడి చేశాడు. ఈ ఘటనపై యూపీలోని వజీర్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆ సమయంలో రాజ్ బబ్బర్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం యూపీ కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని ఓ పోలింగ్‌ బూత్‌కు ఓటర్లు రావడం మానేయడంతో అధికారులు పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో రాజ్‌బబ్బర్‌ తన సహచరులతో కలిసి పోలింగ్‌ బూత్‌కు వచ్చి.. నకిలీ ఓటింగ్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం ప్రారంభించాడు. ఈక్రమంలోనే పోలింగ్ అధికారి శ్రీ కృష్ణ సింగ్ రాణా పై రాజ్ బబ్బర్, అతని సహచరులు దాడికి పాల్పడ్డారు. దీనిపై శ్రీ కృష్ణ సింగ్ రాణా వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి రాజ్ బబ్బర్, అరవింద్ యాదవ్‌లపై సెక్షన్ 143, 332, 353, 323, 504, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్లో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. 2020 మార్చిలో రాజ్ బబ్బర్‌పై అభియోగాలు మోపబడ్డాయి. అయితే అప్పట్లో ఆయనకు ఈ కేసులో బెయిల్ లభించింది. ఇలా ఇన్నేళ్లుగా సాగుతున్న ఈ కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసులో రాజ్ బబ్బర్‌ తప్పు చేశాడని గుర్తించిన కోర్టు.. అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. అలాగే రూ.6,500 జరిమానా విధించింది. కాగా.. కోర్టు తీర్పుపై రాజ్ బబ్బర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పు వెలువడే సమయంలో రాజ్ బబ్బర్ కోర్టులో ఉన్నారు. ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేస్తానని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..