BMRCL Recruitment 2023: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్‌.. నెలకు రూ.లక్షకుపైగా జీతంతో బెంగళూరు మెట్రోలో ఉద్యోగాలు..

|

Mar 31, 2023 | 1:51 PM

కేంద్ర ప్రభుత్వానికి చెందిన బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఎంఆర్‌సీఎల్‌).. 68 డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ..

BMRCL Recruitment 2023: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్‌.. నెలకు రూ.లక్షకుపైగా జీతంతో బెంగళూరు మెట్రోలో ఉద్యోగాలు..
Bangalore Metro Rail Corporation Limited
Follow us on

కేంద్ర ప్రభుత్వానికి చెందిన బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఎంఆర్‌సీఎల్‌).. 68 డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సిగ్నలింగ్‌, రోలింగ్‌ స్టాక్‌, టెలికమ్యునికేషన్‌, ట్రాక్షన్‌, ఈసీఎస్‌, డిపో మెషినరీ, ఆపరేషన్‌ సేఫ్టీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబందిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి.

ఈ ఆర్హతలున్నవారు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 17, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

జీతభత్యాల వివరాలు..
డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.1.4 లక్షలు జీతంగా చెల్లిస్తారు.
ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.85,000 జీతంగా జీతంగా చెల్లిస్తారు.
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.65,000 జీతంగా చెల్లిస్తారు.
అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.50,000 జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

అడ్రస్‌..

General Manager (HR), Bangalore Metro Rail Corporation Limited, III Floor, BMTC Complex, K.H. Road, Shanthinagar, Bengaluru 560 027.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.