Corona Vaccine: దేశంలో భారీగా టీకా నిల్వలు.. బ్లూమ్ బర్గ్ నివేదికలో ఆసక్తికర విషయాలు
దేశంలో వయో భేదంతో పని లేకుండా ఇప్పటి వరకూ అందరికీ 184 కోట్లకు పైగా వ్యాక్సిన్‌లు అందించారు. అంతేకాకుండా 17.25 కోట్ల టీకా డోసులు ఇప్పటికీ నిల్వలుగా మిగిలిపోయాయి. కరోనా నుంచి రక్షణ కోసం డీసీజీఐ...
దేశంలో వయో భేదంతో పని లేకుండా ఇప్పటి వరకూ అందరికీ 184 కోట్లకు పైగా వ్యాక్సిన్‌లు అందించారు. అంతేకాకుండా 17.25 కోట్ల టీకా డోసులు ఇప్పటికీ నిల్వలుగా మిగిలిపోయాయి. కరోనా నుంచి రక్షణ కోసం డీసీజీఐ తొమ్మిది వ్యాక్సిన్‌లకు అనుమతి ఇచ్చింది. 12-14 ఏళ్ల పిల్లలకు కార్బొవాక్స్ టీకా ఇస్తున్నారు. మార్చి 21న ఢిల్లీ హైకోర్టు, 12 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు సంబంధించి స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్ చావ్లాలతో కూడిన ధర్మాసనం స్టేటస్ రిపోర్టును మూడు వారాల్లోగా దాఖలు చేసి, మే 12న తదుపరి విచారణకు ఈ అంశాన్ని జాబితా చేయనున్నట్లు వెల్లడించింది. జనవరి 3 నుంచి 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 9.53 కోట్ల కొవాక్సిన్ డోసులు ఇచ్చారు.
దేశంలో దాదాపు 17.25 కోట్ల వ్యాక్సిన్ డోసులు స్టాక్‌లో ఉన్నాయని బ్లూమ్‌బెర్గ్ సమాచారం ప్రకారం తెలుస్తోంది. 184 దేశాలలో 11.2 బిలియన్ల కంటే ఎక్కువ డోసులు ఇచ్చారని.. భారతదేశంలో ఇప్పటివరకు 184 కోట్ల డోసులు ఇచ్చారని వెల్లడించింది. త్వరలో మరిన్ని వ్యాక్సిన్ లు ఆన్‌లైన్‌లోకి రావచ్చని బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది.
మరోవైపు.. మహారాష్ట్రలో(Maharashtra) నేటి నుంచి మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరాఠీ నూతన సంవత్సరం అయిన గుడిపడ్వా సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది. కొవిడ్(Covid) నియంత్రణలు తొలగింపబడినప్పటికీ.. వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మాస్కులు వాడడం, వాడకపోవడం అనేది ప్రజల వ్యక్తిగత అభిప్రాయమని, అది తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్(Cabinet) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్లడించారు.
Also Read
Bhagwant Mann: పంజాబ్ తీర్మానంతో మళ్లీ మొదలైన వివాదం.. ఇప్పటికైనా ఆ సమస్య తీరుతుందా..
Health Tips: కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలకి దూరంగా ఉండటం మంచిది..!