BJP Expenditure in Election: భారతీయ జనత పార్టీ ఈ ఏడాదిలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రూ.252 కోట్లను ఖర్చు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందింది. పశ్చిమబెంగాల్ , తమిళనాడు , అసోం , పుదుచ్చేరి , కేరళ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరిగాయి. అయితే, బెంగాల్ ఎన్నికల ప్రచారం కోసమే బీజేపీ మొత్తం రూ.252 కోట్లలో 60 శాతం నిధులను ఖర్చు చేసినట్టు ఈ నివేదిక వెల్లడించింది.
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా సీఎం మమతా బెనర్జీపై పట్టు సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేసింది బీజేపీ. ఇందు కోసం రూ.151 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ, అసోంలో రూ.44 కోట్లు ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెట్టింది. పుదుచ్చేరిలో దాదాపు రూ. ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తమిళనాడు ఎన్నికల్లో రూ.23 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ కేవలం 2.6 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. ఇక, లెఫ్ట్‌ఫ్రంట్ విజయం సాధించిన కేరళలో బీజేపీ రూ.30 కోట్లు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టింది. ఈమేరకు ఈసీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది.
కేంద్ర ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన ఎన్నికల ఖర్చు నివేదికను పోల్ ప్యానెల్ బయటపెట్టింది. అయితే, బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో కోసం బీజేపీ కంటే తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువ ఖర్చు చేసినట్టు పోల్ ప్యానెల్ నివేదిక వెల్లడించింది. బీజేపీ బెంగాల్‌లో రూ.151 కోట్లు ఖర్చు చేయగా తృణమూల్ కాంగ్రెస్ రూ.155 కోట్లు ఖర్చు చేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సుడిగాలి ప్రచారం నిర్వహించారు. అయినప్పటికి తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. 200 పైగా అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్ విజయం సాధించింది. బీజేపీ 70 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది.
Read Also… ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కార్యాలయాల్లో “యెగా” బ్రేక్.. వీడియో
Gujarat Restricts: గుజరాత్ సర్కార్ సంచలన నిర్ణయం.. వ్యాక్సిన్ వేసుకోకుంటే అనుమతి నిరాకరణ!