న్యూఢిల్లీ, అక్టోబర్ 14: సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో.. దేశ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ప్రత్యక్ష మాటల యుద్ధమే కాకుండా.. సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ కార్టూన్స్ వార్ నడుస్తోంది. త్వరలో జరుగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలు ఎన్డీయే కూటమికి సెమీ ఫైనల్స్ కావడంతో.. ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే.. విపక్షాలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా దూకుడు పెంచింది. ప్రస్తుత టెక్ యుగంలో.. ఏదైనా అంశం ప్రజలకు త్వరగా చేరువ కావాలంటే సోషల్ మీడియానే సరైన ప్రసార మాద్యమం. అందుకే.. ప్రధాన పొలిటికల్ పార్టీలన్నీ సోషల్ మీడియానే తమ ఆయుధంగా మలుచుకుంటాయి. ఈ విషయంలో బీజేపీ నలుగు అడుగులు ముందే ఉందని చెప్పాలి.
తాజాగా ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ బీజేపీ సోషల్ మీడియా వింగ్ సెటైరికల్ కార్టూన్స్ షేర్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్ పట్టుకుంది. ప్రతి ఒక్కరూ మ్యాచ్‌లను వీక్షిస్తూ, టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోయారు . అందునా.. శనివారం రోజు భారత్ – పాక్ మ్యాచ్ ఉంది. హాట్ రైవల్స్ మధ్య పోరు అంటే.. జనాలు ఎన్ని పనులు ఉన్నా పక్కనబెట్టి మరీ మ్యాచ్‌ను తిలకిస్తారు. ఈ క్రీకెట్ ఫీవర్‌ను క్యాష్ చేసుకుంటూ.. క్రికెట్ స్టైల్‌లోనే ఇండియా కూటమిలోని పార్టీలను టార్గెట్ చేస్తూ కార్టూన్ పిక్చర్లను రిలీజ్ చేసింది. ఒక్కో నేతను ఒక్కో స్టైల్లో చిత్రీకరిస్తూ పంచ్‌లు వేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, ఉద్ధవ్ థాక్రే, హేమంత్ సోరేన్, కమ్యూనిస్టులను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేసింది బీజేపీ.
➢ రాహుల్ గాంధీ: బ్యాట్‌ను గిటార్‌గా భావించే పూర్ పప్పూ మళ్లీ ఓడిపోవడానికి వచ్చాడు.
➢ మమతా బెనర్జీ: అవినీతి, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ గేమ్స్ ఆడుతారు.
➢ లాలూ ప్రసాద్ యాదవ్: ఫీల్డ్‌లోని గడ్డిని సైతం జీర్ణించుకోవడానికి తహతహలాడుతున్నాడు.
➢ అరవింద్ కేజ్రీవాల్: బంతిని క్యాచ్ పట్టుకోవడానికి బదులుగా బౌండరీకి విసురుతారు.
➢ భగవంత్ మాన్ సింగ్: పొలిటికల్ పిచ్‌ను అర్థం చేసుకోలేక బొక్కబోర్లా పడిన భగవంత్.
➢ ఉద్ధవ్ థాక్రే: తన గూగ్లీనే తానే బాధితుడిగా మారిన ఉద్ధవ్.
➢ హేమంత్ సోరేన్: వేలాది స్కామ్‌లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.
➢ కమ్యూనిస్ట్ వర్సెస్ తృణమూల్: వారిలో వారే కత్తులు దూసుకుంటారు.. యూనిటీ ఎక్కడ?
➢ అఖిలేష్ యాదవ్: క్రిమినల్స్ నాయకుడు, ఫీల్డింగ్ చేస్తూ టీమ్‌ను ఓడించడంలో ముందుంటారు.
➢ ఇండియా కూటమి ఓడిపోవడానికి మరోసారి సిద్ధమైంది అంటూ ఒక్కొక్క లీడర్‌పై సెటైరికల్ పంచ్‌లు వేశారు.
पप्पू बेचारा बल्ले को ही समझता गिटार!
I.N.D.I. Alliance फिर हारने को तैयार… pic.twitter.com/u0TdrTlNrk
— BJP (@BJP4India) October 14, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..