Tarun Chugh: ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధి: బీజేపీ నేత తరుణ్ చుగ్

|

Aug 06, 2021 | 11:20 AM

Tarun Chugh: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించింది. తిరంగా ర్యాలీలు

Tarun Chugh: ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధి: బీజేపీ నేత తరుణ్ చుగ్
Tarun Chugh
Follow us on

Tarun Chugh: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించింది. తిరంగా ర్యాలీలు నిర్వహించడంతోపాటు.. నాయకులు జాతీయ జెండాలను సైతం ఆవిష్కరించారు. దీనిలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, జమ్మూ కాశ్మీర్ ఇంచార్జ్ తరుణ్ చుగ్ గురువారం శ్రీనగర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. కాశ్మీర్‌కు ఇది చారిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్నారు. కాశ్మీర్ విభజన పేరుతో ముఫ్తీ, అబ్దుల్లా కుటుంబాలు ఇంతకాలం దోచుకుంటున్నాయంటూ ఆయన ఆరోపించారు. వారి వల్లే కాశ్మీర్‌లో అభివృద్ధి నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. వేర్పాటువాదులు, తీవ్రవాద శక్తులు ఎదురుదెబ్బలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 తర్వాతే ఈ ప్రాంతంలో అభివృద్ధి, పురోగతి వాతావరణం కనిపిస్తుందన్నారు. దీంతోపాటు ప్రజలలో సైతం అభివృద్ధి కాంక్ష చిగురించిందని.. అందరూ ఇలాంటి వాతవరణాన్నే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఆర్టికల్ 370 చట్టాన్ని మళ్లీ పున:రుద్ధరించాలని ఏర్పడిన గుప్కార్ కూటమిపై తరుణ్ చుగ్ విరుచుకుపడ్డారు. అది గుప్కార్ గ్యాంగ్ అంటూ విమర్శించారు.

Also Read:

RBI News: ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష.. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం

Dail 112 : అత్యవసర డయల్ 100 నెంబర్ మారుతోంది.. ఇకపై దేశవ్యాప్తంగా ఒక్కటే నెంబర్.. “112”