BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఆయనే.. కీలక ప్రకటన చేసిన అమిత్‌షా..

|

Jan 17, 2023 | 4:31 PM

బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ కార్యవర్గం ఆమోదించింది.

BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఆయనే.. కీలక ప్రకటన చేసిన అమిత్‌షా..
JP Nadda
Follow us on

బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా(జేపీ నడ్డా) పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ విషయాన్ని ప్రకటించారు. జేపీ నడ్డా నేతృత్వంలోనే 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని వెల్లడించారు అమిత్‌షా. జూన్‌ 2024 వరకు నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగుతారని తెలిపారు. నడ్డా పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం ఆమోదించింది.

బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో నడ్డా కీలక పాత్ర పోషించారని అమిత్‌షా తెలిపారు. తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఏర్పడిందన్నారు. లక్షా 30 వేల బూత్‌లెవెల్‌ కమిటీలను నడ్డా నిర్మించారని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2024 జూన్ వరకు బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారని అమిత్ షా తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే అతిపెద్ద మహమ్మారి కోవిడ్‌ను ప్రపంచం మొత్తం ఎదుర్కోవాల్సి వచ్చింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో పల్లెపల్లెకు సేవా కార్యక్రమాలను తీసుకెళ్లారు. రోగులను ఆసుపత్రికి పంపడం.. వారిని అన్ని విధాలుగా సహకరించడం చేశారని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి పాపులారిటీని పెంచడంలో జేపీ నడ్డా కూడా సహకరించారని హోంమంత్రి అమిత్ షా అన్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం..