Telugu News India News BJP MP Varun Gandhi Fire on Centra Government on Free Ration telugu news
Ration: “ఉచిత రేషన్ ఇచ్చి కృతజ్ఞతలు ఆశిస్తారా”.. కేంద్రంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఫైర్
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi).. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రశంసిస్తూనే పరోక్షంగా ప్రభుత్వంపై మిమర్శలు చేస్తున్నారు. కరోనా కారణంగా రేషన్ ద్వారా కేంద్రం సరకులు అందిస్తున్న విషయం...
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi).. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రశంసిస్తూనే పరోక్షంగా ప్రభుత్వంపై మిమర్శలు చేస్తున్నారు. కరోనా కారణంగా రేషన్ ద్వారా కేంద్రం సరకులు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ ఎంపీ పార్లమెంట్ వేదికగా.. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ (Ration) అందిస్తున్న ప్రభుత్వానికి అభినందనలు తెలపాలని చెప్పారు. ఈ ప్రకటనపై స్పందించిన వరుణ్ ట్విటర్ (Twitter) వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పేదలకు 5 కేజీల ఉచిత రేషన్ అందించి కృతజ్ఞతలు కావాలనుకుంటున్న ఈ సభ గత ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలు మాఫీ చేసిందని చెబుతోంది. ఈ ఉచితాల జాబితాలో మెహుల్ చోక్సీ, రిషి అగర్వాల్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. దీనిని బట్టి ప్రభుత్వ నిధుల్లో ఎవరికి హక్కు ఉందని ప్రశ్నించారు. అంతే కాకుండా మాఫీ చేసిన బకాయిల వివరాలనూ తన ట్వీట్‌కు జత చేశారు. అంతే కాకుండా ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి ప్రమాదంగా మారాయని అభివర్ణించారు. ఈ ఉచితాలపై ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
जो सदन गरीब को 5 किलो राशन दिए जाने पर ‘धन्यवाद’ की आकांक्षा रखता है।
కాగా.. బీజేపీ పార్టీకి వరుణ్ గాంధీ రాజీనామా చేస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. మేనకా గాంధీ, వరుణ్ గాంధీ పశ్చిమబంగ లోని టీఎంసీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. తృణమూల్ శిబిరం అఖిల భారత రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న తరుణంలో వీరు పార్టీ మారితే మంచి ప్రయోజనం ఉంటుందని వార్తలు వెల్లడయ్యాయి. తద్వారా తృణమూల్ అధికార విస్తరణకు మార్గం మరింత విస్తృతమవుతుందని భావించారు. ఆ సమయంలో మేనకా గాంధీ కోల్ కతా లో కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.