ఎప్పుడూ వివాదాల చుట్టూ తిరిగే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్.. ఈ సారి క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కాళీమాత దేవాలయంలో అమ్మవారి దర్శించుకున్నారు. అనంతరం స్థానిక క్రీడాకులతో కలిసి కబడ్డీ ఆడారు. దసరా సందర్భంగా మొదట గుడిలో పూజల్లో పాల్గొన్న ప్రజ్ఞా ఠాకూర్ అనంతరం గుడి వద్ద మహిళలకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తుండడాన్ని చూశారు. ఎంపీ ప్రజ్ఞాను కూడా ఆడాలని అమ్మాయిలూ అడిగారు. వెంటనే కబడ్డీ కోర్టులోకి దిగి పోయిన ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కాసేపు సరదాగా కబడ్డీ.. కబడ్డీ అంటూ ఆడారు.
కబడ్డీ ఆడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సంచలనంగా మారాయి. మాలెగావ్ కేసులో ఆమె ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె కబడ్డీ ఆడిన వీడియోను పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్ ఆమెను ఎద్దేవా చేస్తూ కామెంట్స్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముందు ఆమె విచారణకు మళ్లీ ఎప్పుడు హాజరు కావాల్సి ఉందంటూ ప్రశ్నించారు.
कल गरबा आज भोपाल सांसद @SadhviPragya_MP आज मां काली के दर्शन के लिए पहुंचीं,वहां ग्राउंड में मौजूद खिलाड़ियों के अनुरोध पर महिला खिलाड़ियों के साथ कबड्डी खेली।? pic.twitter.com/X1wWOg55aW
— Anurag Dwary (@Anurag_Dwary) October 13, 2021
ఇవి కూడా చదవండి: Teacher Beating: అమ్మో.. సారు కొట్టుడు మాములుగా లేదుగా.. విద్యార్థులను మరో రేంజ్‌లో చితకబాదిన టీచర్..
Potato Cheela Recipe: ఆలుతో అద్భుమైన బ్రేక్‌ఫాస్ట్.. పిజ్జాను మించిపోయే రుచి.. ఇంకెందుకాలస్యం
SBI: దాచుకోవడమే కాదు.. సంపాదించడం కూడా తెలుసుకోండి.. ఎస్‌బీఐ అందించే అద్భతమైన డిపాజిట్ స్కీమ్..
Chanakya Niti: జీవితంలో ఈ మూడింటిని వదిలేస్తే.. ధన లక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది..