BJP: కొనసాగుతున్న బీజేపీ ఎన్నికల వ్యూహం.. తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో ఎన్నికల ఇంచార్జ్‌‌ల నియామకం..

బీజేపీ అధిష్టానం పార్టీలో సంస్థాగత మార్పులను కొనసాగిస్తోంది. ఇటీలవే 5 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను మార్చిన బీజేపీ తాజాగా 4 రాష్ట్రాల ఎన్నికల ఇన్‌చార్జ్‌లను ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్‌గా ప్రకాశ్‌ జవదేకర్‌, -సహ ఇన్‌చార్జ్‌గా సునీల్‌ బన్సల్‌‌ని నియమించింది.

BJP: కొనసాగుతున్న బీజేపీ ఎన్నికల వ్యూహం.. తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో ఎన్నికల ఇంచార్జ్‌‌ల నియామకం..
BJP High Command

Updated on: Jul 07, 2023 | 5:23 PM

బీజేపీ అధిష్టానం పార్టీలో సంస్థాగత మార్పులను కొనసాగిస్తోంది. మరి కొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు, ఆపై సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఇటీవలే 5 రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల మార్పును చేపట్టింది.  తాజాగా తెలంగాణ సహా 4 రాష్ట్రాల ఎన్నికల ఇన్‌చార్జ్‌లను కూడా ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్‌గా ప్రకాశ్‌ జవదేకర్‌, సహ ఇన్‌చార్జ్‌గా సునీల్‌ బన్సల్‌‌ని నియమితులయ్యారు. ఇంకా ప్రహ్లాద్ జోషికి రాజస్థాన్, ఓం మాథుర్‌కి ఛత్తీస్‌గఢ్, భూపేంద్ర యాదవ్‌కిని మధ్యప్రదేశ్ బాధ్యతలను బీజేపీ అగ్రనేతలు అప్పగించారు.

ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే.. ఇటీవలే బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ చైర్మన్‌గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు తాజాగా తెలంగాణ ఎన్నిల ఇంచార్జ్, సహ ఇంచార్జ్‌గా నియమితులైన నేషనల్‌ టీమ్‌తో కలిసి ఈటల కలిసి  పనిచేయనున్నారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి నెలలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎలెక్షన్స్ జరగాలి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు తెలంగాణ సహా జనవరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న రాష్ట్రాలకు కూడా బీజేపీ తన పార్టీ తరఫున ఎన్నికల ఇంచార్జ్‌లను ప్రకటించినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..