Madhya Pradesh Poll Result: భారీ సీట్ల ఆధిక్యంలో బీజేపీ.. మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారం ఖాయంగా కనిపిస్తోంది..

మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 116 స్థానాలు గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సగమం అవుతుంది. కానీ బీజేపీ 167 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే.. కాంగ్రెస్ 62, ఇతరులు 1 స్థానాల్లో కొనసాగుతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.

Madhya Pradesh Poll Result: భారీ సీట్ల ఆధిక్యంలో బీజేపీ.. మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారం ఖాయంగా కనిపిస్తోంది..
Bjp Heading For Victory In Madhya Pradesh Assembly Election Vote Counting

Updated on: Dec 03, 2023 | 3:47 PM

మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 116 స్థానాలు గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సగమం అవుతుంది. కానీ బీజేపీ 167 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే.. కాంగ్రెస్ 62, ఇతరులు 1 స్థానాల్లో కొనసాగుతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. దీనిని బట్టి బీజేపీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా మీడియాతో మాట్లాడారు.

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లకంటే కూడా భారీ సంఖ్యలో తమ పార్టీకి మెజార్టీ రాబోతున్నట్లు వెల్లడించారు. మోదీ గుండెల్లో మధ్యప్రదేశ్ ఉందని, మధ్యప్రదేశ్ ప్రజల గుండెల్లో మోదీ ఉన్నారన్నారు. ఇప్పుడు బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వరుసగా రెండో సారి మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని నెలకొల్పినట్లు అవుతుంది. ఉత్తర భారత దేశం మొత్తం మరోసారి మోదీ హవా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. దీని ప్రభావం వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. ఈలోపు పాలన మంచిగా చేసి ప్రభుత్వంపై మరింత సానుకూలతను సంపాధించుకుంటే బీజేపీకి తిరుగులేని విజయం అందుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.

అందుకే అశ్వినీ వైష్ణవ్ మోదీ పాలన గురించి ఒక కొత్త ఒక మాట చెప్పారు. ‘ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గ్యారెంటీలతో భారతదేశం వికసిస్తోంది’ అని ట్విట్టర్‌లో స్పందించారు. అయితే కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో 114 సీట్ల సాధించిన కాంగ్రెస్‌కు ఈసారి విజయావకాశాలు వరిస్తాయనుకుంటే తీవ్ర నిరాశ ఎదురైంది. కేవలం 64 స్థానాల ఆధిక్యాన్ని ఇచ్చి డబుల్ డిజిట్‌కే పరిమితం చేశారు మధ్యప్రదేశ్ ఓటర్లు. గతంలో అధికారానికి దగ్గర వరకూ వచ్చిన కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఇంతటి పతనానికి గురైందో ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఉన్న ఆధిక్యతను బట్టి బీజేపీ గెలుపు ఖాయంగా చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..