ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం జరిగింది. ఆ స్కూల్ డైరెక్టర్ కొడుకు సుమారు రెండేళ్ల పాటు ఓ విద్యార్థినిపై లైంగిక దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ దారుణం గుర్తుకువచ్చినప్పుడుల్లా ఆ బాధిత బాలిక మూర్ఛపోతుండేది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని సహార్సా అనే జిల్లాలో ఈ ఘటన జరిగింది. 2017లో 12 ఏళ్ల బాలిక ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. ఆమె ఆరో తరగతిలో ఉండగా ఆర్థిక పరిస్థితుల కారణంగా స్కూల్ ఫీజు చెల్లించలేకపోయింది. దీంతో ఆ పాఠశాల మహిళ ప్రిన్సిపల్ ఆ బాలికను లైబ్రరీ రూంకు తీసుకెళ్లింది. లైటు స్విచాఫ్ చేసి డోర్‌ను లాక్ చేసింది. దీంతో ఆ గదలో ఉన్నటువంటి ఆ స్కూల్ డైరెక్టర్ కుమారుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు దాన్ని వీడియో కూడా తీశాడు.
ఆ వీడియోతో బాలికను బెదిరిస్తూ రెండు సంవత్సరాల పాటు లైంగిక దాడి చేశాడు ఆ సూల్ డైరెక్టర్ కుమారుడు. అయితే ఆ బాధిత బాలిక భయంతో ఆమెపై జరుగుతున్న లైంగిక దాడి గురించి ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత తల్లిదండ్రులను ఒప్పింది బాలికల పాఠశాలలో చేరింది. కానీ ఆమె ఎవరితో ఎక్కువగా కలిసిది కాదు. ఇక 2022లో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆ తర్వాత నీట్ పరీక్ష కోసం సిద్ధమయ్యేందుకు పాట్నాకు వెళ్లింది. అయితే హాస్టల్‌లో ఉన్నప్పుడు ఆ స్కూల్ డైరెక్టర్ కొడుకు చేసిన లైంగిక దాడులు గుర్తుకు వచ్చినప్పుడల్లా భయంతో మూర్ఛపోయేది ఆ బాలిక. చివరకి హాస్టల్‌మేట్‌కు గతంలో తనకు జరిగిన ఆ దారుణం గురించి చెప్పేసింది. అంతేకాదు ఈ విషయాన్ని కూడా ఎవరికీ చెప్పవద్దంటూ బతిమాలింది. ఇదిలా ఉండగా ఓ రోజు ఆ పాఠశాలలో పరిచయమైన వ్యక్తి నుంచి ఆ యువతికి ఫోన్ వచ్చింది.
అలా మాట్లాడుతుండగా.. గతంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఆ స్కూల్ డైరెక్టర్ కొడుకు పాట్నాలోనే ఉన్నాడని తెలిసింది. ఆ తర్వాత మళ్లీ ఆ యువతికి వరుసగా మూర్ఛలు వచ్చాయి. దీంతో వెంటనే ఆమెను పాట్నాలోని ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. తమ కూతురు గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు పాట్నాకు చేరుకున్నారు. అయితే ఆ యువతి మానసికంగా ఆందోళన చెందుతున్నట్ల వైద్యులు తెలిపారు. ఆమెను ఓ మానసిక వైద్యుని దగ్గరికి తీసుకెళ్లాలని సూచనలు చేశారు. అయితే ప్రస్తుతం 17 ఏళ్ల వయసున్న కుమార్తె ఇలా వరుసగా మూర్ఛపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరికి ఆగస్ట్ 23న మానసిక వైద్యుడి వద్దకు వాళ్ల కూతురుని తీసుకెళ్లారు. ఇక చివరికి 2017 నుంచి రెండేళ్లపాటు తనకు జరిగినటువంటి దారుణం గురించి ఆమె చెప్పేసింది. ఈ నేపథ్యంలో బాధిత యువతి సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. చివరకి స్కూల్ డైరెక్టర్ కుమారుడు, మహిళా ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న బాలికలు ధైర్యంగా ముందుకు వచ్చి బయటపెట్టాలని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కూడా స్పందించారు. దీనికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఆమె శుక్రవారం లేఖ రాశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి