Covid Deaths: 5500 కాదు.. 9000.. కరోనా మరణాల సంఖ్యను సవరించిన ఆ రాష్ట్రం……

| Edited By: Phani CH

Jun 10, 2021 | 10:50 AM

బీహార్ లో కోవిద్ మృతుల సంఖ్యను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ సవరించింది. 5500 మంది మరణించినట్టు మొదట ఈ నెల 8 న ప్రకటించినప్పటికీ..

Covid Deaths: 5500  కాదు.. 9000.. కరోనా మరణాల సంఖ్యను సవరించిన ఆ రాష్ట్రం......
Bihar Health Department
Follow us on

బీహార్ లో కోవిద్ మృతుల సంఖ్యను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ సవరించింది. 5500 మంది మరణించినట్టు మొదట ఈ నెల 8 న ప్రకటించినప్పటికీ.. ఆ మరుసటి రోజే..అది తప్పని, 9,429 మంది మృతి చెందారని వెల్లడించింది. అంటే మరో 3,951 మరణాలను అదనంగా చూపింది. 38 జిల్లాలకూ బ్రేకప్ ఇచ్చినప్పటికీ.. ఈ అదనపు మరణాలను ఎప్పుడు నిర్ధారించారో తెలియడం లేదు. మొత్తానికి ఈ సెకండ్ వేవ్ లో 8 వేలమంది మృతి చెందారు. ఏప్రిల్ నుంచి పోలిస్తే ఇది దాదాపు 6 రెట్లు ఎక్కువ.. ఒక్క పాట్నా సిటీలోనే 2,303 మంది మరణించారు. వెరిఫికేషన్ తరువాత అదనంగా 1,070 మంది మృత్యువాత పడ్డారని వెల్లడైంది. కోలుకున్నవారి సంఖ్య కూడా గందరగోళమే…మొదట 6,983 మంది కోలుకున్నట్టు ప్రకటించగా… ఈ సంఖ్యను మరునాడు 7,01234 కు ఆరోగ్య శాఖ పెంచింది. రికవరీ రేటు లోనూ అయోమయమే.. ముందు రోజున ఈ సంఖ్య 98.70 శాతం ఉండగా.. ఆ తరువాత 97.65 శాతమని పేర్కొన్నారు.

ఇలా అన్నీ తప్పుడు లెక్కలు చూపిన రాష్ట్ర ఆరోగ్య శాఖను అంతా దుయ్యబడుతున్నారు. కోవిద్ రోగుల మృతుల సంఖ్యలోనూ…కోలుకున్న వారి సంఖ్యలోనూ ఇలా తప్పుడు లెక్కలు ఎందుకు చెబుతున్నారని, అంటే మన ఆరోగ్య శాఖ అధికారులతీరు ఇంత దారుణంగా ఉందని అంటున్నారు. ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టి వేతనాలు ఇస్తుండగా ..విధి నిర్వహణలో ఇంత అలసత్వం పనికి రాదంటున్నారు. ఒక్క బీహార్ రాష్ట్రం సంగతే ఇలా ఉంటే ఇక దేశవ్యాప్తంగా కేంద్రం చెబుతున్న లెక్కలను నమ్మవచ్చా అని వారు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గుట్కా నమిలే మొగుడు నాకొద్దు..?? తెగేసి చెప్పిన పెళ్లి కూతురు.. ( వీడియో )

Telangana High Court: ఎట్టకేలకు ఫలించిన సర్కార్ ప్రయత్నాలు.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు..!