Tejashwi Yadav Wedding: ఓ ఇంటి వాడైన బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్.. సాదాసీదాగా వివాహ వేడుక

|

Dec 09, 2021 | 7:27 PM

Tejashwi Yadav Wedding Pics: రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బీహార్‌ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్‌ వివాహం

Tejashwi Yadav Wedding: ఓ ఇంటి వాడైన బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్.. సాదాసీదాగా వివాహ వేడుక
Tejashwi Yadav
Follow us on

Tejashwi Yadav Wedding Pics: రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బీహార్‌ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్‌ వివాహం సాదాసీదాగా జరిగింది. ఢిల్లీకి చెందిన రాచెల్ గోడిన్హోతో తేజస్వి యాదవ్ గురువారం ఏడడుగులు వేశారు. వీరి వివాహం దేశ రాజధాని ఢిల్లీలోని సైనిక్ ఫామ్స్‌లో హిందూ సంప్రదాయం జరిగింది. ఈ పెళ్లి వేడుక లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవీ దంపతులు, కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి ఎస్పీ చీఫ్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ దంపతులు, రాజ్యసభ ఎంపీ మిసా భారతి తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వివాహానికి దాదాపు 50 మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరైనట్లు సమాచారం. వివాహానికి సంబంధించిన దృశ్యాలను తేజస్వి సోదరి రోహిణి ఆచార్య ఒక ట్వీట్‌ చేశారు. ఆర్జేడీ నాయకులు, మద్దతుదారులు కూడా నూతన జంటకు సంబంధించిన చిత్రాలను షేర్ చేశారు. కాగా.. ఏడేళ్ల స్నేహబంధం తర్వాత రాచెల్ గోడిన్హో, తేజస్వి యాదవ్ ఒక్కటయ్యారు. కాగా పెళ్లికూతురు రాచెల్‌ను ఇకపై రాజేశ్వరి యాదవ్‌గా పిలవనున్నారు.

Tejashwi Yadav Wedding Pics

కాగా.. మంగళవారం రాత్రి సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో తేజస్వీ, రాచెల్‌ నిశ్చితార్థం వేడుక జరిగింది. లాలూ ప్రసాద్‌, రబ్రీదేవీల సంతానం తొమ్మిది మందిలో చివరి వాడు తేజస్వీ యాదవ్. ఆయనకు ఏడుగురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. కరోనా కారణంగా అతితక్కువ మందితో వేడుకను నిర్వహించారు.

Also Read:

Army Chopper Crash: అమరవీరుల భౌతికకాయాలను తరలిస్తుండగా యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం

Viral Video: మనోడు గుండెలు తీసిన మోనగాడు.. అంత ఎత్తులో సన్నని తీగపై చక్కగా నడుస్తూ షాకిచ్చాడు..