
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బిహార్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండో దశలో సాయంత్రం 5 గంటల వరకు వరకు 67.14 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈనెల 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికలతో పోలిస్తే 15.6 శాతం పోలింగ్ పెరిగింది. ఎన్డీఏ కూటమి , మహాఘట్‌బంధన్ కూటమి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉంది. గెలుపు రెండు కూటమిలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 242 స్థానాల్లో రెండు కూటమిల మధ్య గట్టి పోటీ ఉంది. తాజాగా తుది దశ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
పీపుల్స్ ఇన్‌సైట్ సర్వే వాళ్లు ఎన్డీయే 133-148 స్థానాలు, మహాఘట్‌బంధన్ 87-102 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ప్రిడిక్ట్ చేశారు.
జేవీసీ పోల్స్ ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే ఎన్డీయే 135-150, ఎంజీబీ: 88-103 సీట్లు వస్తాయని అంచానా వేశారు.
ఇక మ్యాట్రిజ్ సర్వే ఎన్డీయే: 147- 167, ఎంజీబీ: 70-90 సీట్లు వస్తాయని పేర్కొంది
దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయేకు 145- 160, ఎంజీబీ 73-91 వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
మిగిలిన సంస్థల ఎగ్జిట్ పోల్ వివరాలు దిగువన చూడండి….