Nitish Kumar: మహిళలపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు.. అట్టుడికిన బీహార్ అసెంబ్లీ

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ రాష్ట్ర శాసనసభలో చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారింది. సభ తర్వాత సీఎం నితీష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయ ప్రకంపనలు సృష్టించిన తర్వాత, నితీష్ కుమార్ దీనిపై మొదటిసారిగా స్పందించారు. సభలో చేసిన ప్రకటనపై క్షమాపణలు చెప్పారు.

Nitish Kumar: మహిళలపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు.. అట్టుడికిన  బీహార్ అసెంబ్లీ
Bihar Cm Nitish Kumar

Updated on: Nov 08, 2023 | 12:42 PM

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ రాష్ట్ర శాసనసభలో చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారింది. సభ తర్వాత సీఎం నితీష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయ ప్రకంపనలు సృష్టించిన తర్వాత, నితీష్ కుమార్ దీనిపై మొదటిసారిగా స్పందించారు. సభలో చేసిన ప్రకటనపై క్షమాపణలు చెప్పారు. మహిళా విద్య గురించి మాట్లాడానని, తాను మాట్లాడినది ఏదైనా తప్పుగా ఉంటే, క్షమాపణలు కోరుతున్నానన్నారు నితీష్ కుమార్. బీహార్‌లో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, ఇప్పుడు మహిళల అభ్యున్నతికి కూడా కృషి చేస్తున్నామని సీఎం నితీశ్ కుమార్ అన్నారు. అదే సమయంలో సభలో కూడా సీఎం నితీశ్ క్షమాపణలు చెప్పారని, తన ప్రకటన పట్ల సిగ్గుపడుతున్నానని అన్నారు. అలాగే తన ప్రకటనను ఉపసంహరించుకుంటానని చెప్పారు.

బీహార్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం నితీష్, తన ప్రసంగంలో జనాభా నియంత్రణ ప్రక్రియలో మహిళల పాత్రపై “సెక్సిస్ట్”, “అసభ్యకరమైన” వ్యాఖ్యాలు చేసి వివాదానికి కారణమయ్యారు. బీహార్‌లో సంతానోత్పత్తి రేటు పడిపోయిందన్న దానిపై వివరణ ఇస్తూ.. మహిళలను కించపరిచేలా మాట్లాడారు. గతంలో 4.3 శాతం ఉన్న సంతానోత్పత్తి రేటు ఇపుడు 2.9 శాతానికి పడిపోయిందన్నారు సీఎం నితీష్ కుమార్. మహిళలు చదువుకోవడంతో పాటు సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన పెరగదన్నారు. మహిళలకు ఏ సమయంలో ఏం చేయాలో తెలుసన్న నితీష్, అందుకే జనాభా తగ్గుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు చదువు కోవడం వల్ల ఈ సమస్య అన్నట్లు సీఎం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. బీజేపీ సహా ఇతర విపక్షాలు, మహిళ సంఘాలు నితీష్ తీరుపై మండిపడుతున్నాయి.

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజైన బుధవారం ప్రారంభం కాగానే బీజేపీ దుమారం రేపింది. సభ ప్రారంభమైన వెంటనే సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటనపై ప్రతిపక్ష నేత వ్యతిరేకత వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పడం పనికిరాదని విజయ్ కుమార్ సిన్హా అన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, ఉపముఖ్యమంత్రి పంచుకుంటున్న సెక్స్ నాలెడ్జ్ బీహార్‌ను సిగ్గుపడేలా చేసింది. ఈ వ్యక్తులు బీహార్‌లో అధికారంలో కూర్చునే అర్హత లేదు. మేము అంగీకరించమంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు.

దీంతో శాసనసభలో నితీష్‌ కుమార్‌ వివరణ ఇస్తూ.. ‘ఇక్కడ మహిళలకు చదువు చెప్పాలని, మహిళలు తక్కువ చదువుకున్నారని పదే పదే చెబుతున్నామని.. మరింతగా చదవుకోవాలని.. ఇందుకు అనుగుణంగా విద్యా ప్రక్రియను ప్రారంభించామని సీఎం చెప్పారు. చాలా చోట్ల ఇంకా విద్య సదుపాయాలు లేవని, మారుమూల ప్రాంతాలల్లో మహిళలకు విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు నితీష్ కుమార్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…