పట్నా, జులై 16: సరదాగా స్నేహితులతో కాసిన పందెం ఓ వ్యక్తి నిండు ప్రాణాలను హరించింది. ఫుడ్ కాంపిటీషన్‌లో భాగంగా పోటీపడి తిన్నాడు. చివరకు శృతి మించడంతో తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే..
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కొందరు స్నేహితులు గురువారం సరదాగా ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. ఈ పందెంలో పాశ్వాన్ (25) అతని స్నేహితులతో ఎప్పుటూ కలిసే ఓ హోటల్ వద్ద కలిశాడు. వాళ్ల టీంలోని ఒక స్నేహితుడు ఎక్కువ మోమోలు తినడంపై పందెం కాశాడు. అందరూ సై.. అనండంతో ప్లేట్లలో మోమోలు ఎదురుగా పెట్టుకుని తినడం ప్రారంభించారు. ఈ క్రమంలో 150 మోమోలు తిన్న పాశ్వాల్ తీవ్ర అస్వస్థతకు గురై స్పృహతప్పి కిందపడిపోయాడు. అనతరం కొద్ది సేపటికే మృతి చెందాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాశ్వాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాశ్వాల్‌ను చంపాలనే దురుద్దేశంతోనే అతని స్నేహితులు కుట్ర చేసి విషం పెట్టి చంపారని మృతుడి తండ్రి విష్ణు మాంఝీ ఆరోపించారు. మృతుడు బిపిన్ కుమార్ పాశ్వాన్ మొబైల్ రిపేర్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ ఘటన సివాన్ జిల్లాలోని బదిహరియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చింది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.