Amoeba: ముక్కులోంచి వెళ్ళి మెదడుపై అటాక్.. కేరళలో అమీబా కలకలం.. వీడియో.
కేరళలో ఓ వింత వైరస్ అందరినీ కలవరపెడుతోంది. అక్కడ అలప్పుజా జిల్లాలో ఓ 15 ఏళ్ళ కుర్రాడు చనిపోయిన తీరు భయపెడుతోంది. కలుషిత నీటి నుంచి అమీబా కుర్రాడి ముక్కు ద్వారా బుర్రలోకి వెళ్ళి ఏకంగా అతడి మెదడునే తినేసింది.
కేరళలో ఓ వింత వైరస్ అందరినీ కలవరపెడుతోంది. అక్కడ అలప్పుజా జిల్లాలో ఓ 15 ఏళ్ళ కుర్రాడు చనిపోయిన తీరు భయపెడుతోంది. కలుషిత నీటి నుంచి అమీబా కుర్రాడి ముక్కు ద్వారా బుర్రలోకి వెళ్ళి ఏకంగా అతడి మెదడునే తినేసింది. కేరళ ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో అమీబిక్ మెనింగో ఎన్సఫలైటిస్ అనే వ్యాధి ప్రబలుతోంది. ఇది కలుషిత నీటి ద్వారా వ్యాపిస్తోంది. అలప్పుజాలోని పనావల్లికి చెందిన కుర్రాడు కూడా దీని ద్వారానే చనిపోయాడు. బ్యాడ్ వాటర్ లో ఉండే అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించింది. ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుడికి జ్వరం, తలనొప్పి, వాంతులు అవుతాయి. ముక్కు ద్వారా మెదడులోకి వెళ్ళిన అమీబా అక్కడి కణాలను తినేసి ఇన్ఫెక్షన్ వ్యాపింపజేస్తుంది. ఈ అమీబా పేరు naegleria fowleri. కేరళలో ఇంతకు ముందు కూడా కేసులు వచ్చాయి. మొదటగా 2016లో తిరమాలలో ఆ తర్వాత మలప్పురంలో రెండు కేసులు బయటకు వచ్చాయి. అలాగే కోజికోడ్, త్రిశూర్‌లో ఒక్కో కేసు నమోదైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...