బీజేపీలో చేరిన ‘బిగ్‌బాస్ 3’ కంటెస్టెంట్‌

| Edited By:

Oct 26, 2020 | 2:17 PM

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పక్కా ప్రణాళికతో

బీజేపీలో చేరిన బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్‌
Follow us on

Mohan Vaidya BJP: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పక్కా ప్రణాళికతో అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇక జాతీయ పార్టీ బీజేపీ సినీ ప్రముఖులను టార్గెట్‌గా పెట్టుకుంది. కోలీవుడ్‌లోని ప్రముఖులను బీజేపీలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్కే సురేష్‌, ఖుష్బూ, నమిత కాషాయ కండువాను కప్పుకున్నారు. ఇక తాజాగా నటుడు, సింగర్‌, బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్‌ మోహన్ వైద్య బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎల్‌.మురుగన్‌ ఆధ్వర్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read More:

KGF 2: క్రూరత్వానికి అధినేత్రి.. రవీనా టాండెన్ లుక్ విడుదల

నాగ్‌కి స్టంట్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌ హీరో తండ్రి