Electoral Bonds: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. రాజకీయాల్లో కాకరేపుతోన్న ఎలక్టోరల్ బాండ్స్..

|

Feb 15, 2024 | 8:46 PM

Big News Big Debate: ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు.. సంచలనం రేపుతోంది. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల కోసం ఏర్పాటు చేసిన ఈ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తీర్పు సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు మరింత కీలకంగా మారాయి. దీంతో, అసలీ బాండ్ల ఉద్దేశ్యమేంటి? జరుగుతున్న వ్యవహారమేమిటి? అనే చర్చ తెరమీదకు వచ్చింది.

Big News Big Debate: ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు.. సంచలనం రేపుతోంది. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల కోసం ఏర్పాటు చేసిన ఈ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తీర్పు సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు మరింత కీలకంగా మారాయి. దీంతో, అసలీ బాండ్ల ఉద్దేశ్యమేంటి? జరుగుతున్న వ్యవహారమేమిటి? అనే చర్చ తెరమీదకు వచ్చింది.

2017లో కేంద్రం తీసుకొచ్చిన బాండ్ల పథకాన్ని సవాల్‌చేస్తూ గత ఏడాది.. కాంగ్రెస్‌ నేత జయఠాకూర్‌, సీపీఐ మార్క్సిస్ట్‌ , ఇతర ఎన్జీఓల సభ్యులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం బాండ్ల పథకాన్ని రద్దుచేస్తున్నట్టు తీర్పువెలువరించింది. ఎలక్టోరల్‌ బాండ్లు రాజ్యాంగవిరుద్ధమన్న చీఫ్‌ జస్టిస్‌… ఆర్టికల్‌19(1)తో పాటు సమాచారహక్కు చట్టానికి ఇది విఘాతమన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదో మార్గమన్న కేంద్రం వాదనను తప్పుబట్టిన కోర్టు.. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే ఉన్నాయని చెప్పింది. రాజకీయ పార్టీలకు కార్పొరేట్‌ సంస్థలు గంపగుత్తగా విరాళాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించేలా ఈ చట్టం ఉందని అభిప్రాయపడింది. ఈ బాండ్ల విక్రయాలను తక్షణం ఆపేయాలని.. మార్చి 6లోగా పూర్తి వివరాలు ఈసీకి ఇవ్వాలని ఎస్‌బీఐని ఆదేశించింది. 15రోజుల వ్యవధిలో ఉన్న బాండ్లను వెనక్కిచ్చేయాలని రాజకీయా పార్టీలనూ ఆజ్ఞాపించింది న్యాయస్థానం.

సుప్రీం తీర్పుతో ఎలక్టోర్‌ బాండ్లపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. చట్టం పేరిట చీకటి ఒప్పందాలు జరిగాయా? అనే అంశం తెరమీదకు వచ్చింది. ఈ చట్టం వచ్చాక ఏ పార్టీ ఎంత లాభపడిందనే విషయమూ చర్చకు వస్తోంది. అయితే, కోర్టు తీర్పుపై రాజకీయనేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ అవినీతి విధానాలకు ఇది మరో ఉదాహరణ అన్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ. లంచాలు, కమీషన్ల కోసం ఎలక్టోరల్‌ బాండ్లు వాడుకున్నారనీ.. సుప్రీం తీర్పు కేంద్రానికి చెంపపెట్టనీ చెప్పారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజాస్వామ్యానికి, దేశ పౌరులకు ఆశాకిరణమని రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ అన్నారు.

ఇప్పటివరకు ఈ బాండ్ల పథకం ద్వారా… బీజేపీ, కాంగ్రెస్‌ మొదలు ప్రాంతీయ పార్టీల దాకా.. అన్నింటికీ భారీస్థాయిలో నిధులు సమకూరాయి. విరాళాల సేకరణలో గోప్యత అవసరం లేదన్న సుప్రీం తీర్పుతో.. పార్టీలు ఎలా వ్యవహరిస్తాయనేది ఆసక్తి రేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..