Dharmendra Pradhan: ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేది ఇలాంటి విద్యా వ్యవస్థే.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

భారతదేశంలో కృత్రిమ మేధస్సు (మెషీన్ లెర్నింగ్), పర్యావరణ వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు భారత్ ఇప్పటికే గూగుల్‌తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పలు రంగాల్లో పరస్పర సాంకేతికతను, సహకారాన్ని జోడించేందుకు చర్యలు చేపట్టింది.

Dharmendra Pradhan: ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేది ఇలాంటి విద్యా వ్యవస్థే.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
Dharmendra Pradhan

Updated on: Apr 13, 2023 | 9:45 AM

భారతదేశంలో కృత్రిమ మేధస్సు (మెషీన్ లెర్నింగ్), పర్యావరణ వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు భారత్ ఇప్పటికే గూగుల్‌తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పలు రంగాల్లో పరస్పర సాంకేతికతను, సహకారాన్ని జోడించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్‌లను ఉపయోగించే సాంకేతికతను ఇచ్చిపుచ్చుకునేందుకు భువనేశ్వర్ లోని ఏయిమ్స్.. ఐఐటీ కీలక ఒప్పందం చేసుకున్నాయి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) భువనేశ్వర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్.. ఆరోగ్యానికి సంబంధించిన వివిధ రంగాలలో అకడమిక్, రీసెర్చ్ సహకారాన్ని ప్రోత్సహించడానికి అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్‌లను ఉపయోగించే సాంకేతికతను ప్రోత్సహించేందుకు పరస్పర ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు బుధవారం తెలియజేశారు. కాగా.. ఈ ఒప్పందంపై కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. NEP (జాతీయ విద్యా విధానం) కి అనుగుణంగా ఇది ఒక గొప్ప వార్త అంటూ పేర్కొన్నారు. ఈ చర్యలు భవిష్యత్తును నిర్దారిస్తాయన్నారు. మన యువతను ప్రపంచ పౌరులుగా మార్చడంలో మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ చాలా ప్రభావం చూపుతుందన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వర్ ఎయిమ్స్, ఐఐటీ ప్రతినిధులను ప్రశంసించారు. ఆరోగ్యం & సాంకేతికతలో పరస్పర సహకారన్ని ప్రోత్సహించడం కోసం ఇలాంటి చర్యలు ముఖ్యమని గుర్తుచేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి, సాంకేతికతతో మెడికల్ సైన్స్‌ను ఏకీకృతం చేయడానికి, మొదటి-రకం ప్రయత్నంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో AIIMS భువనేశ్వర్, IIT భువనేశ్వర్ ఒక మెమోరాండంపై సంతకం చేశాయి. ఆరోగ్యం, సాంకేతికతకు సంబంధించిన రంగాలలో అకడమిక్, రీసెర్చ్ సహకారాన్ని పరస్పరం ప్రోత్సహం అందించడానికి అవగాహన (MOU) చేసుకున్నట్లు రెండు సంస్థలు ప్రకటించాయి. రెండు ఇన్‌స్టిట్యూట్‌లు ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌లను సులభతరం చేయడానికి అంగీకరించడంతోపాటు.. అకడమిక్ ఎక్సలెన్స్‌ని తీసుకువచ్చే రీఓరియంటేషన్/ట్రైనింగ్ కోర్సులు ప్రారంభించనున్నాయి. దీంతోపాటు. టెక్నాలజీ, హెల్త్‌కేర్‌తో పాటు అకడమిక్ క్రెడిట్-షేరింగ్ మెకానిజంతో కూడిన ఉమ్మడి విద్యా కార్యక్రమాలను అభివృద్ధి చేయనున్నాయి.

“వ్యాధులు, వాటి వ్యాప్తిని ముందస్తుగా నిర్ధారణ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, డిసీజ్ ప్రిడిక్షన్ మోడలింగ్, డిజిటల్ హెల్త్, టూల్స్ డెవలప్‌మెంట్, పరికరాలు, రోగనిర్ధారణ, చికిత్స కోసం వ్యూహాలు వంటి ప్రజారోగ్య అనువర్తనాల కోసం పరిశోధనను ముందుకు తీసుకెళ్లడానికి రెండు సంస్థలు అంగీకరించాయి..”అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిమ్స్ భువనేశ్వర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అశుతోష్ బిశ్వాస్, ఐఐటి భువనేశ్వర్ డైరెక్టర్ శ్రీపాద్ కర్మల్కర్ ఎయిమ్స్ భువనేశ్వర్ ప్రాంగణంలో ఎంఒయుపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ప్రోత్సాహం మరువలేనిదని.. ఈ ఎంఓయూ విజయవంతం కావడానికి సహకరించిన కేంద్ర ఆరోగ్య మంత్రి, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఆరోగ్య సంరక్షణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో అత్యున్నత మార్గాలను అణ్వేషించవచ్చని పేర్కొన్నారు. “వివిధ ఆరోగ్య రుగ్మతలు, మెటీరియల్ డెవలప్‌మెంట్, యాప్ డెవలప్‌మెంట్, సెన్సార్ డెవలప్‌మెంట్, ఇమేజ్-బేస్డ్ డయాగ్నస్టిక్స్, AI, డేటా సైన్సెస్ ఎనేబుల్డ్ స్మార్ట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్‌లకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్‌పై ఈ సహకారం దృష్టి సారిస్తుందని వారు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..