
ఇంటర్యూ పేరుతో ఓ 24 ఏళ్ల భోజ్‌పురి నటిపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడు అత్యాచారం చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో ఆ సినీ నటికి భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ఆమె తరచుగా పోస్టులు పెడుతుంటుంది. ఈ క్రమంలోనే మహేష్ పాండే అనే ఓ వ్యక్తి ఆమెను ఇన్‌స్టాలో పరిచయం చేసుకుని స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు భోజ్‌పురి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. జూన్ 29న గురుగ్రామ్‌లోని ఇంటర్వ్యూ కోసం రావాలని హోటల్‌కు పిలిచాడు. కానీ ఆమె వచ్చాక అతడు లైంగిక దాడి చేశాడు.
ఆ తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించింది. హోటల్‌లో మహేష్ పాండే బుక్ చేసిన గదికి వచ్చాక అతడు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగాడని ఆమె ఫిర్యాదులో చెప్పింది. అనంతరం అతడు మద్యం తీసుకోబోతుండగా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించానని పేర్కొంది. కానీ అతడు నన్ను బలవంతంగా అడ్డగించి అత్యాచారం చేశాడని చెప్పింది. అంతేకాకుండా మహేష్ చంపుతానని కూడా బెదిరించాడని.. నా ప్రైవేట్ వీడియోను ఆన్‌లైన్‌లో పెడతామని అతడి స్నేహితులు కొందరు ఫోన్ చేసి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని.. వెంటనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..